వాణిజ్య నౌకలకు కొత్త రూట్.. హర్మూజ్‌పై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- ప్రతిపాదిత మార్గం భౌగోళిక సమన్వయాలపై రెండు దేశాల మధ్య స్పష్టత
- అమెరికా చర్యల వల్ల జలసంధి ఇంకా సురక్షితం కాదని ఇరాన్ వ్యాఖ్య
- అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్లే జలసంధి మూసివేశామని ఆరోపణ
- పాకిస్థాన్, ఖతార్ పర్యటనలపై ప్రస్తుతానికి ఎలాంటి ప్రణాళిక లేదని వెల్లడి
హర్మూజ్ జలసంధిలో సురక్షితమైన వాణిజ్య నౌకాయాన మార్గాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఒమన్‌తో జరిపిన చర్చల్లో పురోగతి సాధించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య కీలక అంగీకారం కుదిరినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు.
ప్రతిపాదిత మార్గానికి సంబంధించిన భౌగోళిక సమన్వయాలపై ఇరాన్, ఒమన్ మధ్య అవగాహన కుదిరిందని బఘాయీ బుధవారం మీడియాకు వెల్లడించారు. కొన్ని మూడో పక్షాలు అడ్డుకోకపోతే, అంగీకరించిన కీలక అంశాలతో ఒక ఉమ్మడి ప్రకటనను ఖరారు చేస్తున్నట్లు ఆయన వివరించారు. గత రెండు నెలలుగా ఈ మార్గంపై ఇరు దేశాలు సంప్రదింపులు జరుపుతున్నాయని, దీనికి సంబంధించిన సాంకేతిక, చట్టపరమైన, భద్రతాపరమైన అంశాలను ఇరాన్ సమీక్షిస్తోందని పేర్కొన్నారు.
అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడుల కారణంగానే హర్మూజ్ జలసంధిని మూసివేశామని బఘాయీ ఆరోపించారు. ఒమన్‌తో కుదిరిన ద్వైపాక్షిక అవగాహన వల్ల జలసంధిలో నౌకల ప్రయాణానికి పూర్తి భద్రత లభించినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌పై అమెరికా సముద్ర దిగ్బంధనం, ఇతర బెదిరింపు చర్యలు కొనసాగుతున్నాయని గుర్తుచేశారు.
ఇదిలా ఉండగా, ఈ వారాంతంలో ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ లేదా పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘేర్ ఘలీబాఫ్.. పాకిస్థాన్ లేదా ఖతార్‌లలో పర్యటించే ప్రణాళికలేవీ లేవని బఘాయీ తెలిపారు. అయితే, ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఆ దేశాలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. మరోవైపు, ఇరాన్-ఒమన్ మధ్య తాజా దౌత్య పరిణామాల గురించి అరాఘ్చీ తన ఇటలీ కౌంటర్‌పార్ట్ ఆంటోనియో తజానీకి ఫోన్‌లో వివరించారు.