రష్యా సైన్యంలో భారీ మార్పులు.. పుతిన్ కీలక నియామకాలు
- సైన్యంలో పలువురు ఉన్నత సైనికాధికారుల నియామకం
- మానవరహిత వ్యవస్థల విభాగానికి కొత్త అధిపతి
- ఇటీవల 25,000 మంది సైనికులను పెంచుతూ నిర్ణయం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశ సైనిక వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. సైనిక దళాల సంస్థాగత నిర్మాణాన్ని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో రక్షణ మంత్రిత్వ శాఖలో పలువురు ఉన్నతాధికారులను నియమిస్తూ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. కమాండ్, లాజిస్టిక్స్ వ్యవస్థలను మరింత పటిష్టం చేసేందుకే ఈ మార్పులు చేపట్టినట్లు క్రెమ్లిన్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పుతిన్ వెల్లడించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరీ గెరాసిమోవ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా నియామకాల ప్రకారం, డిప్యూటీ రక్షణ మంత్రిగా అలెగ్జాండర్ సాంచిక్ను నియమిస్తూ ఆయనకు ఆయుధాల సేకరణ, సరఫరా బాధ్యతలను అప్పగించారు. మరో డిప్యూటీ రక్షణ మంత్రిగా వాలెరీ సోలోడ్చుక్ నియమితులయ్యారు; ఆయన ఇకపై లాజిస్టిక్స్ సేవలను పర్యవేక్షించనున్నారు. దొనెట్స్క్ ప్రాంతంలో కీలక ఆపరేషన్లను నిర్వహిస్తున్న 'సెంటర్ గ్రూప్ ఆఫ్ ఫోర్సెస్' కమాండర్‌గా ఆండ్రీ ఇవానాయెవ్ను, ఈస్టర్న్ మిలిటరీ డిస్ట్రిక్ట్ యాక్టింగ్ కమాండర్‌గా ప్యోటర్ బోల్గారెవ్ను నియమించారు. అలాగే, కొత్తగా ఏర్పాటు చేసిన మానవరహిత వ్యవస్థల (డ్రోన్) దళాల బాధ్యతలను డెనిస్ లయామిన్కు అప్పగించారు.
రష్యా సైనిక బలాన్ని పెంచే ఉద్దేశంతో పుతిన్ ఇటీవల ఒక ప్రత్యేక డిక్రీపై సంతకం చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారం సైనిక సిబ్బంది సంఖ్యను మరో 25,000 పెంచారు. తాజా పెంపుతో రష్యా సైనిక దళాల మొత్తం సంఖ్య 24,26,130కి చేరుకోగా, అందులో క్రియాశీల సైనికుల సంఖ్య 15,35,000గా ఉంది.