భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Both States
Advertisement
  • నీటిమట్టం 55 అడుగులు దాటి ఉద్ధృతంగా ప్రవాహం
  • ఇసుక క్వారీలో చిక్కుకున్న 44 మందిని కాపాడిన అధికారులు
  • లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు
  • పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
Advertisement
భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్ర రూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు పోటెత్తడంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. శనివారం ఉదయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 55.1 అడుగులకు చేరడంతో అధికారులు మూడో, చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.  

గురువారం కేవలం 30 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం, కాళేశ్వరం నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శుక్రవారం అర్ధరాత్రికి 53 అడుగులకు, శనివారం ఉదయానికి 55.1 అడుగుల ప్రమాదకర స్థాయికి చేరింది. పరిస్థితిని సమీక్షించిన జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్.. లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలకు సూచించారు.

వరద ఉద్ధృతి కారణంగా పర్ణశాల వద్ద స్నానఘట్టాలు పూర్తిగా జలమయమయ్యాయి. సీతవాగు ఉద్ధృతికి సీతమ్మ నార చీరలు, దేవతామూర్తి పీఠంతో పాటు ఇనుప వంతెన కూడా మునిగిపోయాయి. దుమ్ముగూడెం-భద్రాచలం మధ్య శుక్రవారం సాయంత్రం నుంచే రాకపోకలు నిలిచిపోయాయి. తురుబాక ఆర్ అండ్ బీ రహదారిపై నిర్మించిన వంతెన అప్రోచ్ రోడ్లు కోతకు గురై ప్రమాదకరంగా మారాయి.

చార్ల మండలం వీరాపురం శివారులోని ఇసుక క్వారీలో అకస్మాత్తుగా వరద రావడంతో 44 మంది లారీ డ్రైవర్లు, స్థానికులు చిక్కుకుపోయారు. అధికారులు వారిని సురక్షితంగా కాపాడారు. అయితే 30కి పైగా లారీలు అక్కడే నీటిలో చిక్కుకుపోయాయి. సహాయక చర్యల సమయంలో ఇద్దరు పోలీసు అధికారులు తెప్పపై నుంచి నీటిలో పడినా, ఈదుకుంటూ క్షేమంగా బయటపడ్డారు. అశ్వాపురం మండలంలో ఓ గర్భిణిని థర్మాకోల్ తెప్పపై సురక్షిత ప్రాంతానికి తరలించారు.

మరోవైపు, గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.                                
Advertisement

సంబంధిత వార్తలు

Godavari RiverBhadrachalam FloodsThird Warning LevelTelangana Heavy RainsBhadradri Kothagudem DistrictGodavari Water Level

More Telugu News

సూర్య 'సీన్' ట్రైలర్ వచ్చేసింది.. దీపావళికి థియేటర్లలో నవ్వులు, యాక్షన్!

31 Oct, 20:53

రూ.20 లక్షల కారుకు రూ.61 లక్షల రిపేర్ బిల్లు.. బెంబేలెత్తిన టెక్కీ!

31 Oct, 20:07

బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం.. ఇస్రో శాటిలైట్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు

31 Oct, 19:53

విండీస్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమి.. భారత్ కు అలా కలిసొచ్చింది!

31 Oct, 19:19

రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది.. రాప్తాడు ఘటనే నిదర్శనం: జగన్

31 Oct, 19:13

అనీష్, అనశ్వర రాజన్ 'ఇట్లు అర్జున'.. కొత్త రిలీజ్ డేట్ ఖరారు

31 Oct, 19:05

జగన్ ఆస్తుల కేసు విచారణ ముమ్మరం.. 45 డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పూర్తి

31 Oct, 18:58

ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని బెంగళూరు తరలింపు.. గ్రీన్ చానల్ ఏర్పాటుకు లోకేశ్ చొరవ

31 Oct, 18:18

ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. సర్వం సిద్ధం.. ప్రతి పోలింగ్ కేంద్రంపై కెమెరా నీడ!

31 Oct, 18:13

మూడేళ్లు గడుస్తున్నా ఆ పనులు ముందుకు కదలడంలేదు: కొడంగల్‌లో డీకే అరుణ

31 Oct, 18:11

'డెమోక్రటిక్ సంఘ' నుంచి తప్పుకున్న రెజీనా

31 Oct, 17:52

స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారు: పేర్ని నాని

31 Oct, 17:36

87 పరుగుల ఓటమి ఎఫెక్ట్‌.. ఐదో టీ20లో భారత్‌ భారీ మార్పులు?

31 Oct, 17:28

'సైబర్ సెక్యూరిటీ కెప్టెన్'గా మమ్ముట్టి.. సినిమా కాదు.. రియల్!

31 Oct, 17:23

ఆసుపత్రి గదిలో అమ్మ కోసం మధురమైన వేణుగానం.. మనసులు గెలుస్తున్న కేంద్ర మాజీ మంత్రి

31 Oct, 17:16
..More Telugu News