పండుగల సీజన్‌కు ముందే యెజ్డీ కొత్త బైక్‌లు.. ‘అన్‌టేమ్డ్ ట్రినిటీ’ శ్రేణి ఆవిష్కరణ
- 2026 యెజ్డీ ‘అన్‌టేమ్డ్ ట్రినిటీ’ విడుదల
- ఓనమ్ సందర్భంగా కేరళ నుంచి ప్రారంభం
- అడ్వెంచర్‌కు ట్యూబ్‌లెస్ క్రాస్-స్పోక్ వీల్స్
- మూడు కొత్త రంగుల మోడళ్ల ఆవిష్కరణ
- రూ.2.05 లక్షల నుంచి ప్రారంభ ధర
- వారంటీ, ఆర్‌ఎస్‌ఏతో ప్రత్యేక ప్యాకేజీ
పండుగల సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ కొత్త 2026 యెజ్డీ ‘అన్‌టేమ్డ్ ట్రినిటీ’ శ్రేణిని విడుదల చేసింది. ఓనమ్ పండుగను పురస్కరించుకుని కేరళ నుంచి ఈ కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 20 కొత్త టచ్‌పాయింట్లను ప్రారంభించింది. దీంతో దేశవ్యాప్తంగా డీలర్ నెట్‌వర్క్‌ను ఈ ఏడాదిలో 500 కేంద్రాలకు, 2028 ఆర్థిక సంవత్సరం నాటికి 700 టచ్‌పాయింట్లకు విస్తరించాలనే లక్ష్యాన్ని కంపెనీ ప్రకటించింది.
ఈ కొత్త శ్రేణిలో యెజ్డీ అడ్వెంచర్, రోడ్‌స్టర్, స్క్రాంబ్లర్ మోడళ్లను కొత్త రంగులు, అప్‌డేట్లతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా యెజ్డీ అడ్వెంచర్‌కు వినియోగదారులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫ్యాక్టరీ ఫిటెడ్ ట్యూబ్‌లెస్ క్రాస్-స్పోక్ వీల్స్‌ను తొలిసారి అందించింది. సంప్రదాయ స్పోక్ వీల్స్ బలాన్ని, ట్యూబ్‌లెస్ టైర్ల సౌకర్యాన్ని ఒకేసారి అందించేలా ఈ వీల్స్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
యెజ్డీ అడ్వెంచర్ ‘యెల్లో ఫాల్కన్’ వేరియంట్‌లో 334 సీసీ లిక్విడ్ కూల్డ్ ఆల్ఫా2 ఇంజిన్ ఉంది. ఇది 29.6 హెచ్‌పీ శక్తి, 29.9 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్‌తో పాటు రోడ్, రైన్, ఆఫ్‌రోడ్ అనే మూడు ఏబీఎస్ మోడ్‌లు ఉన్నాయి. సాధారణ స్పోక్ వీల్స్ మోడల్ ధర రూ.2,12,969 కాగా, ట్యూబ్‌లెస్ క్రాస్-స్పోక్ వీల్స్‌తో కూడిన మోడల్ ధర రూ.2,32,969 (ఎక్స్‌షోరూమ్).
యెజ్డీ రోడ్‌స్టర్ ‘గ్రీన్ మాంబా’ కొత్త మ్యాట్ గ్రీన్ పెయింట్, అరబికా బ్రౌన్ సీటు, కాపర్ డెకల్స్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇందులో కూడా 334 సీసీ లిక్విడ్ కూల్డ్ ఆల్ఫా2 ఇంజిన్‌తో పాటు 6-స్పీడ్ గేర్‌బాక్స్, అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌ను అందించారు. ఈ మోడల్ ధర రూ.2,05,969గా నిర్ణయించారు.
యెజ్డీ స్క్రాంబ్లర్ ‘గ్రే పాంథర్’ మెటాలిక్ గ్రే రంగు, బ్రౌన్ రిబ్డ్ సీటు, ట్యాంక్ ప్యాడ్‌లతో కొత్త రూపంలో వచ్చింది. ఇందులో 334 సీసీ లిక్విడ్ కూల్డ్ కటార్ ఇంజిన్‌ను ఉపయోగించారు. 30 హెచ్‌పీ శక్తి, 30 ఎన్ఎం టార్క్‌తో పాటు లీటరుకు 30 కిలోమీటర్ల మైలేజీ అందేలా ఇంజిన్‌ను ట్యూన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. దీని ధర కూడా రూ.2,05,969 (ఎక్స్‌షోరూమ్).
కొత్త బైక్‌లతో పాటు కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన అమ్మకాల తర్వాత సేవలను కూడా ప్రకటించింది. నాలుగేళ్లు లేదా 50 వేల కిలోమీటర్ల వారంటీని ప్రామాణికంగా ఇస్తోంది. దీన్ని ఆరేళ్ల వరకు పొడిగించుకునే అవకాశం ఉంది. ఏడాది పాటు ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ను అందిస్తోంది. దీన్ని ఎనిమిదేళ్ల వరకు పొడిగించుకోవచ్చు. ఐదేళ్ల వార్షిక నిర్వహణ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంచింది. కొత్త రంగుల శ్రేణికి దేశవ్యాప్తంగా బుకింగ్‌లు ప్రారంభమైనట్లు కంపెనీ వెల్లడించింది.