సమాధుల మధ్య టీ, టిఫిన్.. 75 ఏళ్లుగా జనాలతో కిటకిటలాడుతున్న రెస్టారెంట్.. ఎక్క‌డో తెలుసా?

Offbeat
Advertisement
  • అహ్మదాబాద్‌లో 26 సమాధుల మధ్య నడుస్తున్న న్యూ లక్కీ రెస్టారెంట్
  • ఇవి 16వ శతాబ్దానికి చెందిన సూఫీ సాధువుల సమాధులని నమ్మకం
  • ఇక్కడ టీ తాగితే మంచి జరుగుతుందని స్థానికుల బలమైన విశ్వాసం
  • సమాధులను రోజూ శుభ్రపరిచి, పూలతో అలంకరించి ప్రార్థనలు
  • ఈ హోటల్‌ను పలువురు ప్రముఖులు సైతం సందర్శించిన వైనం
Advertisement
అహ్మదాబాద్‌లోని లాల్ దర్వాజా ప్రాంతంలో ఒక రెస్టారెంట్ ఉంది. దాని పేరు ‘న్యూ లక్కీ రెస్టారెంట్’. బయటకు సాధారణ హోటల్‌లా కనిపించినా లోపలికి వెళితే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే.. అక్కడ కస్టమర్లు కూర్చునే టేబుళ్ల మధ్యలో ఏకంగా 26 సమాధులు ఉన్నాయి. గత 75 ఏళ్లుగా ఈ రెస్టారెంట్ ఇలాగే నడుస్తోంది. అయినా సరే, ఇక్కడికి వచ్చే జనం ఏమాత్రం తగ్గలేదు.

ఈ రెస్టారెంట్ ఏర్పాటు వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది. సుమారు 75 ఏళ్ల క్రితం కృష్ణన్ కుట్టీ అనే వ్యక్తి ఈ స్థలాన్ని కొనుగోలు చేసి, రెస్టారెంట్ నిర్మాణం మొదలుపెట్టారు. ఆ సమయంలో అక్కడ ఈ సమాధులు బయటపడ్డాయి. ఇవి 16వ శతాబ్దానికి చెందిన సూఫీ సాధువులు, వారి బంధువులవని స్థానికులు నమ్ముతారు. వాటిని తొలగించడం ఇష్టంలేని కుట్టీ, వాటి చుట్టూ ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేసి, వాటి మధ్య ఖాళీ ప్రదేశంలో టేబుళ్లు వేసి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఇప్పటికీ ఆ సమాధులను ఎంతో గౌరవంగా చూసుకుంటున్నారు. ప్రతిరోజూ వాటిని శుభ్రపరిచి, తాజా పూలు ఉంచి, ప్రార్థనలు చేస్తారు. దీనికి సమీపంలోనే ఒక దర్గా కూడా ఉంది.

ఈ రెస్టారెంట్ మసాలా చాయ్, బన్ మస్కాకు చాలా ప్రసిద్ధి. స్థానిక కుటుంబాలు, ఉద్యోగులు, విద్యార్థులు, పర్యాటకులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారు ఇక్కడికి వస్తుంటారు. ఏదైనా ముఖ్యమైన పని, పరీక్ష లేదా శుభకార్యానికి వెళ్లే ముందు ఇక్కడ టీ తాగితే అదృష్టం కలిసి వస్తుందని చాలామంది బలంగా నమ్ముతారు. ఈ సమాధుల వల్లే తమ వ్యాపారం ఇంతగా వృద్ధి చెందిందని యజమానులు కూడా చెబుతుంటారు.

కాలక్రమేణా ఈ రెస్టారెంట్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ప్రముఖ టీవీ షో ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’లో దీనిని చూపించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వంటి ప్రముఖులు కూడా ఈ హోటల్‌ను సందర్శించారు. చారిత్రక సమాధులను గౌరవిస్తూ, వాటి మధ్యలో దైనందిన వ్యాపారం కొనసాగించడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత. అందుకే ఇది అహ్మదాబాద్‌లోని ఒక విలక్షణమైన ప్రదేశంగా నిలిచిపోయింది.
Advertisement

సంబంధిత వార్తలు

New Lucky RestaurantAhmedabadRestaurant with gravesSufi saint gravesUnique dining experienceRahul Gandhi

More Telugu News

ఏపీకి మరో తుపాను గండం.. నెల్లూరు-నరసాపురం మధ్య తీరం దాటనున్న తీవ్ర తుపాను!

31 Oct, 22:06

ఆ 53 రోజుల అక్రమ నిర్బంధంపై కోట్లాది ప్రజల స్పందనను ఎప్పటికీ మరువను: సీఎం చంద్రబాబు

31 Oct, 21:54

డబ్ల్యూటీసీ పట్టికలో పెను మార్పులు.. అగ్రస్థానానికి న్యూజిలాండ్, నాలుగో స్థానానికి టీమిండియా

31 Oct, 21:40

రామ్‌చరణ్‌-సుకుమార్‌ క్రేజీ ప్రాజెక్ట్.. రేపే గ్రాండ్ ఓపెనింగ్

31 Oct, 21:33

ఇది నిజం గెలిచిన రోజు.. న్యాయం జరిగిన రోజు: నారా లోకేశ్

31 Oct, 21:24

ఆసీస్ ను కుప్పకూల్చి.. సిరీస్ గెలిచి.. టెస్టుల్లో తిరిగి నెం.1గా దక్షిణాఫ్రికా

31 Oct, 21:11

సీఈసీపై ఇండియా కూటమి 'ప్రజా అభిశంసన'.. బీజేపీ గెలుపు చట్టవిరుద్ధమన్న రాహుల్

31 Oct, 20:59

సూర్య 'సీన్' ట్రైలర్ వచ్చేసింది.. దీపావళికి థియేటర్లలో నవ్వులు, యాక్షన్!

31 Oct, 20:53

రూ.20 లక్షల కారుకు రూ.61 లక్షల రిపేర్ బిల్లు.. బెంబేలెత్తిన టెక్కీ!

31 Oct, 20:07

బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం.. ఇస్రో శాటిలైట్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు

31 Oct, 19:53

విండీస్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమి.. భారత్ కు అలా కలిసొచ్చింది!

31 Oct, 19:19

రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది.. రాప్తాడు ఘటనే నిదర్శనం: జగన్

31 Oct, 19:13

అనీష్, అనశ్వర రాజన్ 'ఇట్లు అర్జున'.. కొత్త రిలీజ్ డేట్ ఖరారు

31 Oct, 19:05

జగన్ ఆస్తుల కేసు విచారణ ముమ్మరం.. 45 డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పూర్తి

31 Oct, 18:58

ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని బెంగళూరు తరలింపు.. గ్రీన్ చానల్ ఏర్పాటుకు లోకేశ్ చొరవ

31 Oct, 18:18
..More Telugu News