కుప్పంలో కొనసాగుతున్న నారా భువనేశ్వరి పర్యటన.. క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ప్రారంభం

Andhra
Advertisement
  • కుప్పంలో రెండో రోజు పర్యటించిన నారా భువనేశ్వరి
  • క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ తో పాటు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన వైనం
  • కుప్పానికి 30 పరిశ్రమలు తెచ్చి వేలాది ఉద్యోగాలు కల్పిస్తామన్న భువనేశ్వరి
  • రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని వెల్లడి
  • డీఎస్సీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని వ్యాఖ్య
Advertisement
ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో తన పర్యటనను రెండో రోజు కొనసాగించారు. ఈ సందర్భంగా ఆమె పలు అభివృద్ధి, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, స్విమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాన్ని, టీఎన్‌ఎస్ఎఫ్ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. క్యాన్సర్ మహమ్మారిపై మహిళల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ఏర్పాటు చేసిన స్విమ్స్ ప్రతినిధులను అభినందించారు. ముందస్తు జాగ్రత్తలు, చైతన్యం ద్వారా క్యాన్సర్ ముప్పు నుంచి మహిళలను కాపాడవచ్చని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని, ముఖ్యంగా తలసీమియా వ్యాధిగ్రస్త పిల్లలకు ఉచితంగా సురక్షితమైన రక్తాన్ని అందిస్తూ అండగా నిలుస్తున్నామని వివరించారు.

కుప్పం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని భువనేశ్వరి అన్నారు. గతంలో ఇక్కడి నుంచి ఉపాధి కోసం యువత కర్ణాటకకు వలస వెళ్లేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుందని భరోసా ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఒకేసారి కుప్పానికి 30 పరిశ్రమలు తీసుకువచ్చారని, వీటి ద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు.

అనంతరం రాజకీయ అంశాలపై మాట్లాడుతూ.. డీఎస్సీ నిర్వహణపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. కుప్పం ప్రజలు తనను ఎంతో ఆదరిస్తున్నారని, వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement

సంబంధిత వార్తలు

Nara BhuvaneshwariKuppam DevelopmentCancer Screening UnitChandrababu NaiduSVIMS Mobile UnitNTR Trust

More Telugu News

ఏపీకి మరో తుపాను గండం.. నెల్లూరు-నరసాపురం మధ్య తీరం దాటనున్న తీవ్ర తుపాను!

31 Oct, 22:06

ఆ 53 రోజుల అక్రమ నిర్బంధంపై కోట్లాది ప్రజల స్పందనను ఎప్పటికీ మరువను: సీఎం చంద్రబాబు

31 Oct, 21:54

డబ్ల్యూటీసీ పట్టికలో పెను మార్పులు.. అగ్రస్థానానికి న్యూజిలాండ్, నాలుగో స్థానానికి టీమిండియా

31 Oct, 21:40

రామ్‌చరణ్‌-సుకుమార్‌ క్రేజీ ప్రాజెక్ట్.. రేపే గ్రాండ్ ఓపెనింగ్

31 Oct, 21:33

ఇది నిజం గెలిచిన రోజు.. న్యాయం జరిగిన రోజు: నారా లోకేశ్

31 Oct, 21:24

ఆసీస్ ను కుప్పకూల్చి.. సిరీస్ గెలిచి.. టెస్టుల్లో తిరిగి నెం.1గా దక్షిణాఫ్రికా

31 Oct, 21:11

సీఈసీపై ఇండియా కూటమి 'ప్రజా అభిశంసన'.. బీజేపీ గెలుపు చట్టవిరుద్ధమన్న రాహుల్

31 Oct, 20:59

సూర్య 'సీన్' ట్రైలర్ వచ్చేసింది.. దీపావళికి థియేటర్లలో నవ్వులు, యాక్షన్!

31 Oct, 20:53

రూ.20 లక్షల కారుకు రూ.61 లక్షల రిపేర్ బిల్లు.. బెంబేలెత్తిన టెక్కీ!

31 Oct, 20:07

బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం.. ఇస్రో శాటిలైట్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు

31 Oct, 19:53

విండీస్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమి.. భారత్ కు అలా కలిసొచ్చింది!

31 Oct, 19:19

రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది.. రాప్తాడు ఘటనే నిదర్శనం: జగన్

31 Oct, 19:13

అనీష్, అనశ్వర రాజన్ 'ఇట్లు అర్జున'.. కొత్త రిలీజ్ డేట్ ఖరారు

31 Oct, 19:05

జగన్ ఆస్తుల కేసు విచారణ ముమ్మరం.. 45 డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పూర్తి

31 Oct, 18:58

ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని బెంగళూరు తరలింపు.. గ్రీన్ చానల్ ఏర్పాటుకు లోకేశ్ చొరవ

31 Oct, 18:18
..More Telugu News