మస్క్‌ కొత్త అడుగు.. ‘ఎక్స్‌’లోనే బ్యాంకింగ్ సేవలు!

Elon Musk introduces X Money for premium users in USA
  • ‘ఎక్స్‌’లో ‘ఎక్స్ మనీ’ సేవల ప్రారంభం
  • అమెరికా ప్రీమియం సభ్యులకు అందుబాటు
  • యాప్‌లోనే బ్యాంకింగ్, చెల్లింపుల సౌకర్యం
  • గరిష్ఠంగా 6 శాతం వార్షిక వడ్డీ
  • వీచాట్ తరహా ‘ఎవ్రీథింగ్ యాప్’ లక్ష్యం
  • కొత్త సేవపై అమెరికాలో చర్చ
ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో బ్యాంకింగ్ సేవలు ప్రారంభమయ్యాయి. అమెరికాలో ప్రీమియం, ప్రీమియం ప్లస్ సభ్యులకు ఎక్స్ మనీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. జూన్ చివరి నుంచి కొంత మందిపై పరీక్షించిన ఈ ఫీచర్‌ను ఇప్పుడు విస్తృతంగా విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికను ‘ఎవ్రీథింగ్ యాప్‌’గా మార్చాలన్న మస్క్ లక్ష్యంలో ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.

‘ఎక్స్ మనీ’ ద్వారా వినియోగదారులు యాప్‌లోనే డిపాజిట్లు ఉంచడం, ఒకరి ఖాతా నుంచి మరొకరికి డబ్బు పంపడం, బిల్లులు చెల్లించడం, వైర్ ట్రాన్స్‌ఫర్లు చేయడం, చెక్కులు పంపించడం వంటి సేవలు పొందొచ్చు. డిపాజిట్లను న్యూజెర్సీకి చెందిన క్రాస్ రివర్ బ్యాంక్ నిర్వహిస్తుంది. వీటికి అమెరికా ఎఫ్‌డీఐసీ నుంచి 2.5 లక్షల డాలర్ల వరకు బీమా రక్షణ ఉంటుంది. ప్రీమియం ప్లస్ సభ్యులకు ఏడాదికి గరిష్ఠంగా ఆరు శాతం వడ్డీ కూడా ప్రకటించారు.

చైనాలోని వీచాట్ తరహాలో సందేశాలు, చెల్లింపులు, షాపింగ్‌, బ్యాంకింగ్ సేవలు ఒకే యాప్‌లో అందించాలన్నది ఎలాన్ మస్క్ లక్ష్యం. ఈ సేవతో పేపాల్‌కు చెందిన వెన్మో, క్యాష్ యాప్‌, సోఫై వంటి డిజిటల్ చెల్లింపు సంస్థలకు ‘ఎక్స్’ పోటీ ఇవ్వనుంది. అయితే అధిక వడ్డీ ఎలా చెల్లిస్తారంటూ అమెరికా సెనేట్ బ్యాంకింగ్ కమిటీ సభ్యురాలు ఎలిజబెత్ వారెన్ ప్రశ్నలు లేవనెత్తారు.
Advertisement
Elon Musk
X Money Banking
Everything App
Social Media Finance
Cross River Bank
Digital Payments

More Telugu News