అదే నా అసలు పేరు.. ఇకపై నన్ను అలాగే పిలవండి: పవన్ అర్ధాంగి ఎమోషనల్ పోస్ట్
Advertisement
- తనను అన్నా కొణిదెలగా పిలవాలని విజ్ఞప్తి చేసిన పవన్ అర్ధాంగి
- పెళ్లిరోజే కొణిదెల ఇంటిపేరు స్వీకరించానని వెల్లడి
- పుట్టినరోజు సందర్భంగా పేరుపై స్పష్టత ఇస్తున్నట్లు ప్రకటన
- పవన్ కల్యాణ్‌తో కలిసి దిగిన పాత ఫొటోను షేర్ చేసిన అన్నా
Advertisement
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా కొణిదెల సోషల్ మీడియా వేదికగా ఓ కీలక విజ్ఞప్తి చేశారు. తన పేరును చాలాకాలంగా తప్పుగా ప్రచారం చేస్తున్నారని, ఇకపై తనను 'అన్నా లెజినోవా' అని కాకుండా 'అన్నా కొణిదెల' అని పిలవాలని ఆమె అభిమానులను, మీడియాను కోరారు. తన పుట్టినరోజు సమీపిస్తున్న వేళ, ఈ విషయాన్ని అధికారికంగా చెప్పేందుకు ఇదే సరైన సమయమని భావించినట్లు ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు.
"వివాహ ధ్రువీకరణ పత్రంలో మాత్రమే నా పేరు చివరిసారిగా ‘లెజినోవా’గా నమోదైంది. పెళ్లయిన రోజే నేను నా భర్త ఇంటిపేరు స్వీకరించి, ‘అన్నా కొణిదెల’గా మారాను" అని ఆమె స్పష్టం చేశారు. తన అసలు పేరు అదేనని, ఆ పేరులోనే తాను సంపూర్ణంగా ఉన్నానని భావిస్తున్నట్లు ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.
ఈ సందేశంతో పాటు పవన్ కల్యాణ్‌తో కలిసి దిగిన ఒక అందమైన ఫొటోను కూడా అన్నా పంచుకున్నారు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు తాము కలిసి వెళ్లిన తొలి ట్రిప్‌లో ఈ ఫొటో తీసుకున్నామని ఆమె తెలిపారు. ఈ ఫొటోలో పవన్ స్టైలిష్ లుక్‌లో కనిపించగా, ఆయన పక్కన అన్నా చిరునవ్వుతో కనిపించారు.
అన్నా కొణిదెల చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 60 వేలకు పైగా లైక్‌లు రాగా, వేలాది మంది అభిమానులు, జనసేన కార్యకర్తలు సానుకూలంగా స్పందిస్తున్నారు. "ఇకపై మిమ్మల్ని అన్నా కొణిదెలగానే పిలుస్తాం వదినమ్మా" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.