మతం మారితే ‘ఎస్సీ’ హోదా కోల్పోయినట్లే: మరోసారి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

National
Advertisement
  • మతం మారితే తక్షణమే ఎస్సీ హోదా రద్దవుతుందన్న సుప్రీంకోర్టు
  • హిందూ, సిక్కు, బౌద్ధ మతస్తులు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని వ్యాఖ్య
  • మతం మారితే ఎస్సీ ప్రయోజనాలు కోల్పోతారని స్పష్టీకరణ
Advertisement

షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గానికి చెందిన వ్యక్తి ఇతర మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా తక్షణమే రద్దవుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను కాదని క్రిస్టియానిటీ లేదా ఇతర మతాలను స్వీకరించిన వ్యక్తులకు ఎస్సీ రిజర్వేషన్లు, కుల ధ్రువీకరణ పత్రాలు చెల్లవంటూ గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.


జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వుల ప్రకారం... హిందూ, సిక్కు, బౌద్ధ మతస్థులు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని, మతం మారిన మరుక్షణమే ఎస్సీ హోదా, దాని ఆధారిత ప్రయోజనాలు ముగుస్తాయని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎలాంటి పొరపాటు లేదని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. పునఃపరిశీలన పిటిషన్‌ను తోసిపుచ్చింది.


ఒకవేళ ఎవరైనా తిరిగి ఎస్సీ హోదాను పొందాలంటే... రాజ్యాంగం నిర్దేశించిన మూడు ప్రధాన నిబంధనలకు (పుట్టుకతో ఎస్సీ అయి ఉండటం, స్వచ్ఛందంగా తిరిగి సొంత మతంలోకి రావడం, మూల కుల సమాజం వారిని ఆమోదించడం) కట్టుబడి ఉండాలని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు వెలువరించిన ఈ కీలక తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వేషన్ విధానాలు, మత మార్పిడి వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

Advertisement

సంబంధిత వార్తలు

Supreme Court of IndiaSC status conversion rulesScheduled Caste reservation benefitsReligious conversion legal rulingConstitution 1950 OrderSC reservation eligibility

More Telugu News

ఏపీకి మరో తుపాను గండం.. నెల్లూరు-నరసాపురం మధ్య తీరం దాటనున్న తీవ్ర తుపాను!

31 Oct, 22:06

ఆ 53 రోజుల అక్రమ నిర్బంధంపై కోట్లాది ప్రజల స్పందనను ఎప్పటికీ మరువను: సీఎం చంద్రబాబు

31 Oct, 21:54

డబ్ల్యూటీసీ పట్టికలో పెను మార్పులు.. అగ్రస్థానానికి న్యూజిలాండ్, నాలుగో స్థానానికి టీమిండియా

31 Oct, 21:40

రామ్‌చరణ్‌-సుకుమార్‌ క్రేజీ ప్రాజెక్ట్.. రేపే గ్రాండ్ ఓపెనింగ్

31 Oct, 21:33

ఇది నిజం గెలిచిన రోజు.. న్యాయం జరిగిన రోజు: నారా లోకేశ్

31 Oct, 21:24

ఆసీస్ ను కుప్పకూల్చి.. సిరీస్ గెలిచి.. టెస్టుల్లో తిరిగి నెం.1గా దక్షిణాఫ్రికా

31 Oct, 21:11

సీఈసీపై ఇండియా కూటమి 'ప్రజా అభిశంసన'.. బీజేపీ గెలుపు చట్టవిరుద్ధమన్న రాహుల్

31 Oct, 20:59

సూర్య 'సీన్' ట్రైలర్ వచ్చేసింది.. దీపావళికి థియేటర్లలో నవ్వులు, యాక్షన్!

31 Oct, 20:53

రూ.20 లక్షల కారుకు రూ.61 లక్షల రిపేర్ బిల్లు.. బెంబేలెత్తిన టెక్కీ!

31 Oct, 20:07

బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం.. ఇస్రో శాటిలైట్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు

31 Oct, 19:53

విండీస్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమి.. భారత్ కు అలా కలిసొచ్చింది!

31 Oct, 19:19

రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది.. రాప్తాడు ఘటనే నిదర్శనం: జగన్

31 Oct, 19:13

అనీష్, అనశ్వర రాజన్ 'ఇట్లు అర్జున'.. కొత్త రిలీజ్ డేట్ ఖరారు

31 Oct, 19:05

జగన్ ఆస్తుల కేసు విచారణ ముమ్మరం.. 45 డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పూర్తి

31 Oct, 18:58

ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని బెంగళూరు తరలింపు.. గ్రీన్ చానల్ ఏర్పాటుకు లోకేశ్ చొరవ

31 Oct, 18:18
..More Telugu News