యూపీలో పొత్తుకు సిద్ధం.. అఖిలేశ్‌కు అసదుద్దీన్ ఓవైసీ ఓపెన్‌ ఆఫర్

National
Advertisement
  • యూపీలో బీజేపీని ఓడించేందుకు ఎస్పీతో పొత్తుకు సిద్ధమన్న‌ అసదుద్దీన్ ఓవైసీ
  • ఇప్పుడే చర్చలకు సరైన సమయం, ఎన్నికల తర్వాత బాధపడొద్దని అఖిలేశ్‌కు సూచన
  • గౌరవం, న్యాయం కోసమే తమ పోరాటమని, సమానత్వంతోనే పొత్తు ఉంటుందన్న ఓవైసీ
  • ఇది ఓటు బ్యాంకు రాజకీయాల కలయిక అంటూ బీజేపీ విమర్శలు
Advertisement
దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో మరోసారి రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. 2027లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్‌కు పొత్తు కోసం బహిరంగ ఆహ్వానం పంపారు. బీజేపీని మరోసారి అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు కలిసి పనిచేయడానికి ఇదే సరైన సమయమని ఆయన స్పష్టం చేశారు.

మొరాదాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఓవైసీ మాట్లాడుతూ.. "ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని మజ్లిస్ కోరుకోవడం లేదు. అందుకే నేను చేతులు కలపడానికి, పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మాట్లాడటానికి ఇదే సరైన సమయం. ఎన్నికలు ముగిశాక తర్వాత ఏడవద్దు" అంటూ అఖిలేశ్‌ యాదవ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమ పార్టీ పోటీ చేయడం వల్ల ఎస్పీకి నష్టం జరుగుతుందనే వాదనను ప్రస్తావిస్తూ, ఆ నష్టం జరగకుండా ఉండేందుకే తాను పొత్తుకు సిద్ధంగా ఉన్నానని వివరించారు.

అయితే, ఈ పొత్తులో తమకు సమాన గౌరవం, హక్కులు కావాలని ఓవైసీ స్పష్టమైన సంకేతాలిచ్చారు. "మా పోరాటం ఏ మతానికి వ్యతిరేకం కాదు. మా గౌరవం, న్యాయం కోసమే ఈ పోరాటం. అఖిలేశ్ యాదవ్ కుర్చీలో కూర్చుంటే, నేను కూడా ఆయన ముందు సమానంగా కూర్చుని హక్కులు, న్యాయం గురించి చర్చిస్తాను" అని ఆయన పేర్కొన్నారు.

ఓవైసీ పొత్తు ప్రతిపాదనపై బీజేపీ వెంటనే స్పందించింది. ఇది బుజ్జగింపు రాజకీయాల కలయిక అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శించారు. "అఖిలేశ్, ఓవైసీ ఇద్దరూ బుజ్జగింపు రాజకీయాల్లో ఒకరితో ఒకరు పోటీ పడతారు. ఇప్పుడు 'పెద్ద భాయిజాన్ ఎవరు' అనే పోటీని పక్కనపెట్టి 'భాయిజాన్ కలయిక' కోసం చూస్తున్నారు. అందుకే ఓవైసీ, అఖిలేశ్‌కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతున్నారు" అని ఆయన ఎద్దేవా చేశారు.

కాగా, యూపీలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షంగా సమాజ్‌వాదీ పార్టీ ఉంది. 2027 ఎన్నికలను పార్లమెంట్ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న తరుణంలో ఓవైసీ ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ ఆఫర్‌పై అఖిలేశ్ యాదవ్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.
Advertisement

సంబంధిత వార్తలు

Asaduddin OwaisiAkhilesh YadavUttar Pradesh Assembly Elections 2027Samajwadi PartyAIMIMBJP Uttar Pradesh

More Telugu News

ఏపీకి మరో తుపాను గండం.. నెల్లూరు-నరసాపురం మధ్య తీరం దాటనున్న తీవ్ర తుపాను!

31 Oct, 22:06

ఆ 53 రోజుల అక్రమ నిర్బంధంపై కోట్లాది ప్రజల స్పందనను ఎప్పటికీ మరువను: సీఎం చంద్రబాబు

31 Oct, 21:54

డబ్ల్యూటీసీ పట్టికలో పెను మార్పులు.. అగ్రస్థానానికి న్యూజిలాండ్, నాలుగో స్థానానికి టీమిండియా

31 Oct, 21:40

రామ్‌చరణ్‌-సుకుమార్‌ క్రేజీ ప్రాజెక్ట్.. రేపే గ్రాండ్ ఓపెనింగ్

31 Oct, 21:33

ఇది నిజం గెలిచిన రోజు.. న్యాయం జరిగిన రోజు: నారా లోకేశ్

31 Oct, 21:24

ఆసీస్ ను కుప్పకూల్చి.. సిరీస్ గెలిచి.. టెస్టుల్లో తిరిగి నెం.1గా దక్షిణాఫ్రికా

31 Oct, 21:11

సీఈసీపై ఇండియా కూటమి 'ప్రజా అభిశంసన'.. బీజేపీ గెలుపు చట్టవిరుద్ధమన్న రాహుల్

31 Oct, 20:59

సూర్య 'సీన్' ట్రైలర్ వచ్చేసింది.. దీపావళికి థియేటర్లలో నవ్వులు, యాక్షన్!

31 Oct, 20:53

రూ.20 లక్షల కారుకు రూ.61 లక్షల రిపేర్ బిల్లు.. బెంబేలెత్తిన టెక్కీ!

31 Oct, 20:07

బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం.. ఇస్రో శాటిలైట్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు

31 Oct, 19:53

విండీస్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమి.. భారత్ కు అలా కలిసొచ్చింది!

31 Oct, 19:19

రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది.. రాప్తాడు ఘటనే నిదర్శనం: జగన్

31 Oct, 19:13

అనీష్, అనశ్వర రాజన్ 'ఇట్లు అర్జున'.. కొత్త రిలీజ్ డేట్ ఖరారు

31 Oct, 19:05

జగన్ ఆస్తుల కేసు విచారణ ముమ్మరం.. 45 డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పూర్తి

31 Oct, 18:58

ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని బెంగళూరు తరలింపు.. గ్రీన్ చానల్ ఏర్పాటుకు లోకేశ్ చొరవ

31 Oct, 18:18
..More Telugu News