మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్‌.. కుమారుడి ప్రమాద కేసులో కుట్ర ఆరోపణలు

Andhra
Advertisement
  • శ్రీకాకుళంలోని నివాసం నుంచి పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు
  • ఇంటి వద్ద వైకాపా కార్యకర్తలు చేరడంతో ఉద్రిక్తత
  • కొడుకు చేసిన బైక్‌ ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి
  • కుమారుడిని కాపాడేందుకు కుట్ర చేశారనే ఆరోపణలు
  • మరో వ్యక్తిని కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారని అభియోగం
  • బాధిత కుటుంబాన్ని ప్రలోభపెట్టారని కేసు నమోదు
Advertisement
శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ జీఎంఈ కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇటీవల అప్పలరాజు కుమారుడు ఆరవ్‌ వర్మ నడిపిన బైక్‌ ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతిచెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో కుమారుడిని కాపాడేందుకు అప్పలరాజు కుట్ర చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

ప్రమాదానికి కారణమైన ఆరవ్‌ వర్మకు బదులుగా సిద్ధార్థ త్యాడి అనే వ్యక్తిని కేసులో ఇరికించి జైలుకు పంపే ప్రయత్నం చేశారని, బాధిత కుటుంబాన్ని ప్రలోభపెట్టారని, అలాగే ప్రమాదానికి సంబంధించిన బైక్‌ను మార్చి ఆధారాలను తారుమారు చేయాలని చూశారన్న అభియోగాలతో అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే ఆయన్ను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Advertisement

సంబంధిత వార్తలు

Seediri AppalarajuSrikakulam PoliceYSRCP Leader ArrestArav Varma Accident CasePalasa Former Minister ArrestAndhra Pradesh Political News

More Telugu News

ఏపీకి మరో తుపాను గండం.. నెల్లూరు-నరసాపురం మధ్య తీరం దాటనున్న తీవ్ర తుపాను!

31 Oct, 22:06

ఆ 53 రోజుల అక్రమ నిర్బంధంపై కోట్లాది ప్రజల స్పందనను ఎప్పటికీ మరువను: సీఎం చంద్రబాబు

31 Oct, 21:54

డబ్ల్యూటీసీ పట్టికలో పెను మార్పులు.. అగ్రస్థానానికి న్యూజిలాండ్, నాలుగో స్థానానికి టీమిండియా

31 Oct, 21:40

రామ్‌చరణ్‌-సుకుమార్‌ క్రేజీ ప్రాజెక్ట్.. రేపే గ్రాండ్ ఓపెనింగ్

31 Oct, 21:33

ఇది నిజం గెలిచిన రోజు.. న్యాయం జరిగిన రోజు: నారా లోకేశ్

31 Oct, 21:24

ఆసీస్ ను కుప్పకూల్చి.. సిరీస్ గెలిచి.. టెస్టుల్లో తిరిగి నెం.1గా దక్షిణాఫ్రికా

31 Oct, 21:11

సీఈసీపై ఇండియా కూటమి 'ప్రజా అభిశంసన'.. బీజేపీ గెలుపు చట్టవిరుద్ధమన్న రాహుల్

31 Oct, 20:59

సూర్య 'సీన్' ట్రైలర్ వచ్చేసింది.. దీపావళికి థియేటర్లలో నవ్వులు, యాక్షన్!

31 Oct, 20:53

రూ.20 లక్షల కారుకు రూ.61 లక్షల రిపేర్ బిల్లు.. బెంబేలెత్తిన టెక్కీ!

31 Oct, 20:07

బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం.. ఇస్రో శాటిలైట్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు

31 Oct, 19:53

విండీస్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమి.. భారత్ కు అలా కలిసొచ్చింది!

31 Oct, 19:19

రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది.. రాప్తాడు ఘటనే నిదర్శనం: జగన్

31 Oct, 19:13

అనీష్, అనశ్వర రాజన్ 'ఇట్లు అర్జున'.. కొత్త రిలీజ్ డేట్ ఖరారు

31 Oct, 19:05

జగన్ ఆస్తుల కేసు విచారణ ముమ్మరం.. 45 డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పూర్తి

31 Oct, 18:58

ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని బెంగళూరు తరలింపు.. గ్రీన్ చానల్ ఏర్పాటుకు లోకేశ్ చొరవ

31 Oct, 18:18
..More Telugu News