ఎల్లుండి తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌కు పిలుపు

Telangana
Advertisement
  • విద్యార్థి సంఘాల ఐక్యవేదిక పిలుపు
  • ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌
  • ఎన్‌టీఏను రద్దు చేయాలని పట్టు
  • వీవీబీఎస్‌ఏ బిల్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌
  • ఢిల్లీ పోలీసుల చర్యలపై విచారణకు డిమాండ్‌
Advertisement
దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్‌ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, అవకతవకలకు నిరసనగా జులై 24న తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్‌, ఏఐఎస్‌బీ, ఏఐపీఎస్‌యూ సంఘాలు ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి.

హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు బంద్‌ వివరాలను వెల్లడించారు. వరుస పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశ విద్యా వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు.

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ని రద్దు చేయాలని, విద్యా వ్యవస్థ స్వయంప్రతిపత్తికి భంగం కలిగిస్తోందని ఆరోపిస్తున్న వీవీబీఎస్‌ఏ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసుల దాడిపై పారదర్శక విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

జులై 24న జరిగే విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యాలు, తల్లిదండ్రులు, మేధావులు సంపూర్ణ మద్దతు తెలిపి విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక విజ్ఞప్తి చేసింది.
Advertisement

సంబంధిత వార్తలు

Telangana Student UnionsTelangana School BandhJuly 24 Telangana StrikeNEET Paper Leak ProtestNational Testing AgencyDharmendra Pradhan Resignation

More Telugu News

వైభవ్‌ను స్వేచ్ఛగా ఆడనివ్వండి.. అతడే భవిష్యత్తు: సనత్ జయసూర్య

31 Oct, 10:48

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌.. భారత జట్టులో కీలక మార్పు

31 Oct, 10:46

‘ఆదర్శ కుటుంబం’కు తొలి రోజు మంచి వసూళ్లు.. టాప్‌-7లో వెంకటేశ్‌ సినిమా!

31 Oct, 10:41

ఉద్యోగాల్లో దూసుకెళ్తున్న మహిళలు.. ఇంట్లో మాత్రం గొడ్డుచాకిరి!

31 Oct, 10:39

వయసు పెరిగే కొద్దీ కండరాల బలం ఎందుకు తగ్గుతుంది? అసలు కారణాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు!

31 Oct, 10:29

డయాబెటిస్ నియంత్రణకు వ్యాయామం.. నిపుణులు చెప్పే జాగ్రత్తలివే!

31 Oct, 10:17

అమెరికా ఎన్నికలు: భారతీయ ఓటర్ల కోసం దోసెలు వేస్తున్న అభ్యర్థులు!

31 Oct, 10:14

ముంబైలో దావూద్‌ ఆధిపత్యానికి బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సవాల్‌.. టైగర్‌ ష్రాఫ్‌ కాల్పుల కేసులో కీలక విషయాలు!

31 Oct, 10:10

కివీస్‌పై భారీ ఓటమి.. కెప్టెన్ అయ్యర్ కెప్టెన్సీపై నీలినీడలు

31 Oct, 10:08

పేపర్‌ స్ట్రాలే ప్లాస్టిక్‌ కంటే ప్రమాదకరమా? తాజా అధ్యయనంలో సంచలన విషయాలు!

31 Oct, 10:00

కంటిచూపు మందగించిందని ఆసుపత్రికి వెళ్లిన వృద్ధుడు.. కళ్లలో తిరుగుతున్న పురుగులు.. వైద్యుల షాక్‌!

31 Oct, 09:50

న్యూజిలాండ్ 'ఎ'తో రెండో టెస్ట్: మళ్లీ విఫలమైన జైస్వాల్.. తొలిరోజు ఇండియా 'ఎ' కష్టాలు

31 Oct, 09:47

సిద్ధరామయ్యపై స్టింగ్‌ ఆపరేషన్‌ ఆరోపణలు.. కాంగ్రెస్‌ కీలక మహిళా నేతపై వేటు!

31 Oct, 09:45

యువకుడి ఖాతాలో రూ. 10,000 కోట్లు.. కానీ డ్రా చేయలేకపోయాడు!

31 Oct, 09:43

పోలాండ్‌లో తీవ్ర రాజ్యాంగ సంక్షోభం.. న్యాయస్థానం అధ్యక్షుడిపై వేటు!

31 Oct, 09:39
..More Telugu News