నారా లోకేశ్ వచ్చిన తర్వాతే మాకు గుర్తింపు వచ్చింది... మంగళగిరిలో ఇంటి పట్టాల లబ్ధిదారుల హర్షం
- మంగళగిరిలో శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారా లోకేశ్
- ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారని లబ్ధిదారుల హర్షం
- లోకేశ్ వచ్చిన తర్వాతే తమకు గుర్తింపు దక్కిందని స్థానికుల ఆనందం
- దశాబ్దాల తమ నిరీక్షణకు తెరపడిందని లబ్ధిదారుల భావోద్వేగం
- నియోజకవర్గ అభివృద్ధిపై లోకేశ్‌కు ప్రశంసలు
మంగళగిరి నియోజకవర్గంలో పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందిస్తామన్న హామీని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ నిలబెట్టుకున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో మంగళవారం నిర్వహించిన ‘మన ఇల్లు-మన లోకేశ్’ కార్యక్రమంలో ఆయన వందలాది మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న తమ కల నెరవేరిందంటూ లబ్ధిదారులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. లోకేశ్ వచ్చిన తర్వాతే తమకు ఓ గుర్తింపు లభించిందని పలువురు భావోద్వేగంతో తెలిపారు.
గతంలో ఎన్నికల ప్రచార సమయంలోనూ, యువగళం పాదయాత్ర సందర్భంగానూ మంగళగిరిలో అర్హులైన పేదలందరికీ శాశ్వత గృహ హక్కు పట్టాలు అందిస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీని నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు పట్టాలతో పాటు నూతన వస్త్రాలు అందించి, భోజన సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు తమ అనుభవాలను, ఆనందాన్ని పంచుకున్నారు.
లబ్ధిదారులు ఏమన్నారంటే..
1. చల్లా భవాని (సలాం సెంటర్, తాడేపల్లి): గత 15 ఏళ్లుగా తాడేపల్లిలో ఉంటున్నాం. లోకేశ్ గారు ఇంటి పట్టాలు ఇస్తారని ఆశగా ఎదురుచూశాం. మొదట్లో కొంచెం అనుమానం ఉన్నా, మా ఆకాంక్షలను ఆయన నెరవేర్చారు. మాకు నూతన వస్త్రాలు బహూకరించి పట్టా అందించిన లోకేశ్ గారికి ధన్యవాదాలు.
2. తురకా శివగురవమ్మ (తాడేపల్లి): 20 ఏళ్లుగా ఇంటి పట్టా కోసం ఎదురుచూస్తున్నాం. పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందిస్తామని లోకేశ్ గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. మంగళగిరి నుంచి ఆయనే మళ్లీ మళ్లీ గెలవాలి.
3. షేక్ మోతి (ఉండవల్లి): మొదటి విడతలో పట్టా రాక బాధపడ్డాం. ఇప్పుడు రెండో విడతలో మంత్రి లోకేశ్ గారు మాకు పట్టా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. లోకేశ్ గారు మంగళగిరిని, రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ సారి నా ఓటు ఆయనకే.
4. ఎన్.హరినాథప్రసాదరావు, ప్రభావతి (పోలకంపాడు, తాడేపల్లి): గత పదేళ్లుగా పోలకంపాడులో ఉంటున్నాం. మాకు శాశ్వత పట్టా అందించి లోకేశ్ గారు ఎంతో మేలు చేశారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. మళ్లీ ఇదే ప్రభుత్వం రావాలి.
5. ఫాతిమున్నీసా (ప్రకాష్ నగర్ క్వారీ): ఈ రోజు మాకు, మా కుమార్తెకు లోకేశ్ గారు శాశ్వత ఇంటి పట్టా ఇచ్చారు. ఇప్పటివరకు మాకు గుర్తింపు లేదు. లోకేశ్ గారు వచ్చాకే గుర్తింపు వచ్చింది. మళ్లీ తండ్రీకొడుకులు చంద్రబాబు గారు, లోకేశ్ గారే రావాలి.
6. తన్నీరు వెంకటేశ్వరరావు, బసవమ్మ (తాడేపల్లి): 40 ఏళ్లుగా తాడేపల్లిలో ప్రభుత్వ భూమిలో ఉంటున్నాం. గతంలో మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. నీరు, కరెంట్ లేక ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు లోకేశ్ గారు శాశ్వత పట్టా అందించి అన్నీ సమకూర్చారు.
7. మునిపల్లి బుజ్జి, సీత (డ్రైవర్ కాలనీ, ప్రకాష్ నగర్): 15 ఏళ్లుగా ప్రకాష్ నగర్లో ఉంటున్నాం. లోకేశ్ గారు ఎన్నికల ముందు మాట ఇచ్చారు, నిలబెట్టుకున్నారు. ఇంటికి పెద్ద కొడుకులా ఆదర్శంగా నిలిచారు. మేం ఆయన వెంటే ఉంటాం.
8. బాయిన సాయి కుమారి (నులకపేట): గత 40 ఏళ్లుగా నులకపేటలో ఉంటున్నాం. ఇంటి పట్టా లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. లోకేశ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని శాశ్వత ఇంటి పట్టా అందించారు. ఆయనకు మా ధన్యవాదాలు.
9. షేక్ గౌసియా (తాడేపల్లి): 20 ఏళ్లుగా తాడేపల్లిలో ఉంటున్నా, మాకు గుర్తింపు లేదు. ఎవరు వచ్చి ఇల్లు కూలగొడతారోననే భయంతో బతికాం. లోకేశ్ గారు వచ్చి మాకు గుర్తింపు ఇచ్చారు. సొంత ఇంట్లో ఉంటున్నామనే భావన ఇప్పుడే కలిగింది.
10. షేక్ ఆయేషా బేగం, షేక్ బాజి బాబు (పద్మశాలీ బజారు, తాడేపల్లి): 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. గతంలో చాలా మంది హామీ ఇచ్చినా ఎవరూ నెరవేర్చలేదు. లోకేశ్ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. మంగళగిరి అభివృద్ధి చెందాలంటే ఆయనే మళ్లీ మళ్లీ రావాలి.