‘నేను ఇంతకాలం జీవిస్తా’.. మీ అంచనాకు, నిజమైన జీవితకాలానికి లింక్ ఉందట!
- జీవితకాలంపై వ్యక్తిగత అంచనాకు సంబంధం ఉన్నట్లు అధ్యయనం
- 2,054 మంది వృద్ధుల వివరాల పరిశీలన
- 28 ఏళ్ల వరకు కొనసాగిన పరిశోధన
- 59 శాతం మంది అంచనా వయసు దాటారు
- మహిళలు ఎక్కువగా అంచనాను అధిగమించారు
మనిషి తాను ఎంతకాలం జీవిస్తానని అనుకుంటున్నాడో.. ఆ అంచనా అతను నిజంగా ఎంతకాలం జీవిస్తాడన్న దానిపై కొంతవరకు సంకేతం ఇవ్వొచ్చని ఓ కొత్త అధ్యయనం చెబుతోంది. జపాన్‌కు చెందిన వృద్ధులపై నిర్వహించిన ఈ పరిశోధనలో.. ఎక్కువ కాలం జీవిస్తామని భావించిన వారు వాస్తవంగా కూడా ఎక్కువకాలం జీవించే అవకాశం ఉన్నట్లు తేలింది. అయితే చాలామంది తాము ఊహించిన వయసు కంటే ఎక్కువకాలం జీవించినట్లు పరిశోధకులు గుర్తించారు.
యూనివర్సిటీ ఆఫ్ సుకుబా ఆధ్వర్యంలో జరిగిన ఈ అధ్యయనంలో సుమారు 2,000 మంది వివరాలను పరిశీలించారు. 28 ఏళ్ల వరకు వారిని అనుసరించి.. తాము ఎంత వయసు వరకు జీవిస్తామని భావిస్తున్నారో, చివరికి ఎంతకాలం జీవించారో పోల్చారు. ఈ పరిశోధన వివరాలు ‘medRxiv’లో ప్రీప్రింట్‌గా ప్రచురితమయ్యాయి. దీనిపై ఇంకా ఇతర శాస్త్రవేత్తల సమీక్ష జరగాల్సి ఉంది.
ఈ పరిశోధన కోసం 1987లో ప్రారంభమైన ‘నేషనల్ సర్వే ఆఫ్ జపనీస్ ఎల్డర్లీ’ సమాచారాన్ని ఉపయోగించారు. 2024లో జరిగిన తాజా సర్వే వివరాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తం 2,054 మంది తాము ఎంత వయసు వరకు జీవిస్తామని అంచనా చెప్పగా.. వారిలో 1,514 మంది అధ్యయన కాలంలో మరణించారు. వారి మరణ తేదీలను అధికారిక రికార్డులు, కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన సమాచారంతో పరిశోధకులు నిర్ధారించారు.
తాము ఎక్కువ వయసు వరకు జీవిస్తామని భావించిన వారిలో వాస్తవంగా కూడా ఎక్కువకాలం జీవించే అవకాశం కనిపించింది. వయసు, లింగం, ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక స్థితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా ఈ సంబంధం కనిపించింది. అయితే దీని అర్థం మనిషి తాను చనిపోయే వయసును కచ్చితంగా అంచనా వేయగలడని కాదు.
మొత్తం పాల్గొన్న వారిలో దాదాపు 59 శాతం మంది తాము ఊహించిన వయసు దాటిన తర్వాత కూడా జీవించారు. మహిళలు తాము అంచనా వేసిన వయసు కంటే ఎక్కువకాలం జీవించే అవకాశం ఎక్కువగా కనిపించింది. ఆరోగ్యం బాగాలేని వారిలో మాత్రం ఈ అవకాశం తక్కువగా ఉంది. చదువుకున్నవారు కూడా తాము ఊహించిన దానికంటే ఎక్కువకాలం జీవించినట్లు పరిశోధకులు గుర్తించారు. చాలామంది తమ జీవితకాలాన్ని అంచనా వేసేటప్పుడు వ్యక్తిగత పరిస్థితుల కంటే సాధారణంగా వినిపించే వయసులను ఎంచుకున్నట్లు తేలింది. 80 ఏళ్లు అనేది ఎక్కువగా చెప్పిన వయసుల్లో ఒకటిగా ఉంది.
జపాన్‌లో ప్రపంచంలోనే అత్యధిక సగటు ఆయుర్దాయం ఉన్న దేశాల్లో ఒకటి. 2024లో అక్కడ పుట్టినప్పుడు సగటు ఆయుర్దాయం పురుషులకు 81.1 ఏళ్లు, మహిళలకు 87.1 ఏళ్లుగా ఉంది. 65 ఏళ్ల వయసులో పురుషులు సగటున మరో 19.5 ఏళ్లు, మహిళలు మరో 24.3 ఏళ్లు జీవించే అవకాశం ఉంది. తాము ఎంతకాలం జీవిస్తామని భావిస్తున్నామన్నది పదవీ విరమణ ఎప్పుడు చేయాలి? ఎంత డబ్బు దాచుకోవాలి? పెన్షన్ ఆదాయాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? వంటి ఆర్థిక నిర్ణయాలపై కూడా ప్రభావం చూపొచ్చని పరిశోధకులు తెలిపారు.