ఇరాన్ అణు రహస్యం.. పర్వతం కిందకి వేల సెంట్రిఫ్యూజ్‌లు!

Iran nuclear secret thousands of centrifuges moved under mountain
  • పికాక్స్ పర్వతం కిందకి వేల సెంట్రిఫ్యూజ్‌లను తరలించిన ఇరాన్
  • ఇజ్రాయెల్, అమెరికా దాడుల నుంచి రక్షణ కోసమే ఈ చర్య
  • గత ఏడాది దాడుల తర్వాత రహస్యంగా తరలింపు జరిగిందని ఇజ్రాయెల్ నిఘా వర్గాల వెల్లడి
ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని మరింత రహస్యంగా కొనసాగిస్తోందని, వేల సంఖ్యలో యురేనియం శుద్ధి చేసే సెంట్రిఫ్యూజ్‌లను అత్యంత సురక్షితమైన భూగర్భ కేంద్రానికి తరలించిందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వెల్లడించాయి. నతాంజ్ అణు కేంద్రానికి దక్షిణంగా ఉన్న పికాక్స్ పర్వతం ప్రాంతంలో భూమి లోపల ఇరాన్ కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అమెరికాకు ఇజ్రాయెల్ సమాచారం అందించింది.

గత ఏడాది జూన్‌లో ఇరాన్‌, ఇజ్రాయెల్-అమెరికా మధ్య 12 రోజుల పాటు చోటుచేసుకున్న ఉద్రిక్తతల అనంతరం ఈ తరలింపు ప్రక్రియ జరిగినట్లు తెలుస్తోంది. ఆ దాడుల్లో నతాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ అణు కేంద్రాలు దెబ్బతినడంతో, కీలక పరికరాలను కాపాడుకునేందుకు ఇరాన్ ఈ చర్యలు చేపట్టింది.

ఈ అణు కేంద్రాల్లో యురేనియాన్ని యురేనియం హెక్సాఫ్లోరైడ్‌గా మార్చి, సెంట్రిఫ్యూజ్‌ల ద్వారా ఇరాన్ శుద్ధి చేసింది. అయితే అది ఇప్పటికీ వాయు రూపంలోనే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అణుబాంబు తయారీకి ఈ వాయువును లోహంగా మార్చాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఇరాన్ వద్ద ప్రస్తుతం ఉన్నాయా అనే దానిపై స్పష్టత లేదు.
Advertisement
Iran
Iran nuclear program
Uranium enrichment centrifuges
Israeli intelligence
Pickaxe Mountain

More Telugu News