భారత్ విజయానికి అడ్డు లేదు.. ఆపరేషన్ సిందూర్ సూపర్ సక్సెస్: ఇమ్రాన్ ఖాన్ సోదరి
- ఆపరేషన్ సిందూర్ విజయాన్ని దాచేందుకు పాకిస్థాన్ సైన్యం ఆపసోపాలు పడుతోందన్న నోరీన్
- ఓటమి భయంతోనే సైన్యం నిజాలను ప్రజల నుంచి దాస్తోందని వ్యాఖ్య
- ట్రంప్ వ్యక్తిగత జోక్యంతోనే పాక్ నాయకత్వానికి ప్రాణరక్షణ దక్కిందని వ్యాఖ్యలు
- సైన్యాన్ని లక్ష్యంగా చేసుకున్నందుకు ఇమ్రాన్ సోదరికి సైబర్ క్రైమ్ ఏజెన్సీ నోటీసులు
- దేశ ప్రయోజనాలను దెబ్బతీసేలా మాట్లాడారంటూ ప్రభుత్వం ఆగ్రహం
జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి నోరీన్ నియాజీ చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి. భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' యుద్ధంలో పాకిస్థాన్ సైన్యం ఎదుర్కొన్న ఘోర ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి అక్కడి జనరల్స్, నాయకత్వం అబద్ధపు 'విజయ గాథలను' ప్రచారం చేస్తున్నారని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో భారత దళాల ఆపరేషన్ అద్భుత విజయం సాధించిందని, అయితే పాక్ ఆర్మీ తన పరాభవాన్ని దాచేందుకు ప్రయత్నిస్తోందని ఒక ఇంటర్వ్యూలో బాంబు పేల్చారు.
ఈ యుద్ధం మరింత ముదరకుండా ఉండేందుకు, పాకిస్థాన్ నాయకత్వానికి తీవ్ర పరాభవం తప్పించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా జోక్యం చేసుకున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇజ్రాయెల్‌ను గుర్తించే ప్రక్రియలో భాగంగానే అబ్రహాం ఒప్పందాలలో పాక్ చేరేందుకు వ్యూహాత్మకంగా అడుగులు పడ్డాయని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సైన్యాన్ని, ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ పాకిస్థాన్ నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇమ్రాన్ సోదరికి నోటీసులు జారీ చేసింది. పిఎంఎల్-ఎన్ ప్రభుత్వ నేతలు కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.