హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అరెస్ట్‌కు ఆదేశాలు ఇచ్చి రద్దు చేసిన ధర్మాసనం!
- లోతుకుంటలోని ప్రైవేటు భూమిలోకి వెళ్లొద్దన్న ఉత్తర్వులను మూడోసారి ధిక్కరించిన హైడ్రా
- కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు రంగనాథ్‌ను అరెస్టు చేయాలని తొలుత ఆదేశించిన హైకోర్టు
- లాయర్ల విజ్ఞప్తితో అరెస్ట్ రద్దు.. సాయంత్రం 6.30 గంటలకు వ్యక్తిగతంగా హాజరైన రంగనాథ్
- రంగనాథ్ వ్యవహారశైలిపై జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు
- ఈ రాష్ట్రంలో 'రూల్ ఆఫ్ లా' అనేది ఒకటి ఉందని గుర్తుచేసిన న్యాయస్థానం
మల్కాజిగిరి లోతుకుంటలోని శాంత శ్రీరాం కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేటు భూమి విషయంలో కోర్టు ఆదేశాలను వరుసగా మూడుసార్లు ధిక్కరించినందుకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందుగా ఆయనను అరెస్టు చేయాలని ఆదేశించినప్పటికీ, ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తితో ఉపసంహరించుకుని వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది.
సాయంత్రం జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ధర్మాసనం ఎదుట హాజరైన రంగనాథ్ కోర్టు చివరి వరుసలో నిలబడ్డారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మండిపడుతూ.. రంగనాథ్ తీరు 'అలవాటుపడ్డ నేరగాడిలా' ఉందని, ప్రభుత్వ అధికారికి ఇంత అహంకారం తగదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 'రూల్ ఆఫ్ లా' ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. హైడ్రా విధివిధానాలు కేవలం చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకేనని, ప్రైవేటు భూముల్లో జోక్యం చేసుకోకూడదని తేల్చిచెప్పారు. ఇకపై ఆ స్థలంలోకి వెళ్లబోమని ఏజీ హామీ ఇవ్వగా, పిటిషనర్‌కు ఎఫ్‌ఐఆర్ కాపీని తక్షణమే ఇవ్వాలని కోర్టు హోంశాఖను ఆదేశించింది.