రూ. 5 లక్షల సబ్సిడీతో 10 అంతస్తుల ఫ్లాట్లు.. క్యూర్ పరిధిలో తొలి విడత ఇళ్ల దరఖాస్తులు ప్రారంభం!
- హైదరాబాద్ పరిధిలో ఎల్‌ఐజీ ఇళ్ల నిర్మాణానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం
- తొలి విడతగా 16 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్ల నిర్మాణం
- ఒక్కో ఇంటి వ్యయం రూ. 11 లక్షలు
- ప్రభుత్వ వాటా రూ. 5 లక్షలు.. లబ్ధిదారుల వాటా రూ. 6 లక్షలు
- జులై 21 నుండి ఆగస్టు 10 వరకు వెబ్‌సైట్, మీ-సేవ ద్వారా దరఖాస్తులకు అవకాశం
- పథకానికి పేరు సూచించి రూ. లక్ష బహుమతి గెలుచుకున్న కొండా నాగరాజు
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలోని అల్పాదాయ వర్గాల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం 'ఇందిరమ్మ ఇండ్లు' పథకానికి శ్రీకారం చుట్టింది. మొదటి విడతగా గుర్తించిన 16 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా నియోజకవర్గానికి 480 చొప్పున మొత్తం 7,680 ఫ్లాట్లను 10 అంతస్తుల భవనాల్లో నిర్మించనున్నట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ఒక్కో ఫ్లాట్ 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనుండగా, దీని నిర్మాణ వ్యయం రూ. 11 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో రూ. 5 లక్షలను ప్రభుత్వం ఉచిత సబ్సిడీగా ఇవ్వగా, మిగిలిన రూ. 6 లక్షలను లబ్ధిదారులు నాలుగు విడతల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఇళ్లకు జులై 21 నుండి ఆగస్టు 10 వరకు తెలంగాణ హౌసింగ్ బోర్డు వెబ్‌సైట్, మీ-సేవ లేదా వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ. 100, ఈఎమ్‌డీ కింద రూ. 10,000 చెల్లించాలి. లాటరీలో ఇల్లు రాని వారికి ఈఎమ్‌డీ సొమ్మును వెంటనే రీఫండ్ చేస్తారు.
గత 10 ఏళ్లుగా నగరంలో నివసిస్తూ, సొంత ఇల్లు లేని రూ. 6 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులు. లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే ఈ ఇళ్లను 10 ఏళ్ల వరకు విక్రయించేందుకు వీల్లేదు. కాగా, ప్రభుత్వం నిర్వహించిన పోటీలో 'ఇందిరమ్మ ఇండ్లు' అనే పేరే బాగుందని, దానినే కొనసాగించాలని సూచించిన నకిరేకల్‌కు చెందిన కొండా నాగరాజుకు మంత్రులు రూ. లక్ష బహుమతి చెక్కును అందజేశారు. వచ్చేఏడు బోనాల నాటికి ఈ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి పేదలకు అందజేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.