రాష్ట్రంలో 81 మంది లిటిగెంట్ పిటిషనర్లను గుర్తించాం: సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu identifies 81 litigant petitioners in the state
  • ప్రజా ప్రయోజనం లేని ఫిర్యాదుదారులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని సీఎం ఆదేశం
  • ఎల్ నినో ప్రభావంతో 49 శాతం వర్షపాతం లోటుపై ఆందోళన
  • ఆరుతడి పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచన
  • సమస్యలు రాకముందే అంచనా వేసి చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం
రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్‌లో సోమవారం వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజా ప్రయోజనం లేకుండా పదేపదే ఫిర్యాదులు చేసే వారిని గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని, ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు.

కొంతమంది ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని, అధికారులను బద్నాం చేసేందుకే పిటిషన్లు వేస్తున్నారని సీఎం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 81 మంది లిటిగెంట్ (సమస్యాత్మక) పిటిషనర్లను గుర్తించామని, వీరు ఒక్కొక్కరు సగటున 246 పిటిషన్లు వేస్తున్నారని తెలిపారు. వీరి వివరాలను కలెక్టర్లకు పంపి, వారు పెట్టే అర్జీల్లో ప్రజా ప్రయోజనం ఉంటేనే పరిశీలించాలని స్పష్టం చేశారు.

ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో 49 శాతం లోటు వర్షపాతం నమోదైందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభావం నుంచి బయటపడటానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని సూచించారు. ఆరుతడి పంటలు (డ్రై క్రాప్స్) వేసేలా రైతులను ప్రోత్సహించాలని, వారిలో అవగాహన కల్పించాలని చెప్పారు. జలధార పనులను వీబీజీ రామ్‌జీ పనులతో అనుసంధానం చేసి పెద్ద ఎత్తున చేపట్టాలని ఆదేశించారు.

ఫిర్యాదుల పరిష్కారంలో ఆర్థికేతర అంశాలకు తక్షణ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం తెలుసుకుంటూ, సమస్యలు రాకముందే అంచనా వేసి చర్యలు తీసుకోవాలని పరిపాలన విధానాల్లో మార్పులు సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh CM
Litigant Petitioners
RTGS Review Meeting
El Nino Impact AP
Rainfall Deficit Andhra Pradesh

More Telugu News