ముడి చమురుకు మళ్లీ రెక్కలు.. 90 డాలర్ల మార్క్ దాటిన బ్యారెల్ ధర
- 90 డాలర్ల మార్క్ దాటిన బ్రెంట్ క్రూడ్
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం
- హర్మూజ్ జలసంధిపై సరఫరా ఆందోళనలు
- ఎంసీఎక్స్‌లో రూ.8,120కు క్రూడ్
- వరుస సైనిక చర్యలతో మార్కెట్‌లో కలవరం
- ధరలు మరింత బలపడే అవకాశముందన్న నిపుణులు
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. సోమవారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 90 డాలర్ల మార్క్‌ను దాటింది. హర్మూజ్ జలసంధి మీదుగా చమురు సరఫరాలకు అంతరాయం కలగొచ్చనే ఆందోళనతో మార్కెట్లలో కొనుగోళ్లు పెరిగాయి. దీంతో గత రెండు రోజులుగా చమురు ధరలు వరుసగా ఎగబాకుతున్నాయి.
బ్రెంట్ క్రూడ్ ధర సోమవారం దాదాపు మూడు శాతం పెరిగి బ్యారెల్‌కు 90 డాలర్లను దాటింది. అంతకుముందు ట్రేడింగ్ సెషన్‌లో కూడా ఇదే స్థాయిలో పెరుగుదల నమోదైంది. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) క్రూడ్ కూడా 3.5 శాతానికి పైగా పెరిగి బ్యారెల్‌కు 85.39 డాలర్ల వద్ద ట్రేడైంది.
దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఆగస్టు క్రూడ్ ఫ్యూచర్స్ ధరలు కూడా జోరందుకున్నాయి. ఉదయం ట్రేడింగ్‌లో బ్యారెల్‌కు రూ.210 పెరిగి రూ.8,120 ఇంట్రాడే గరిష్ఠ స్థాయికి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావమే దేశీయ ధరలపైనా కనిపించింది.
వారాంతంలో అమెరికా, ఇరాన్ మధ్య సైనిక చర్యలు మరింత తీవ్రం కావడం మార్కెట్లను కలవరపరిచింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో లేదని టెహ్రాన్ ప్రకటించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.
అమెరికా సెంట్రల్ కమాండ్ వరుసగా తొమ్మిదో రోజు ఇరాన్‌కు చెందిన లక్ష్యాలపై దాడులు నిర్వహించినట్లు సోమవారం ప్రకటించింది. వాణిజ్య నౌకలు, పౌర నౌకలపై దాడులకు తెగబడుతున్న ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని బలహీనపర్చడమే తమ లక్ష్యమని తెలిపింది. మరోవైపు హర్మూజ్ జలసంధిలో నాలుగు నౌకలను అడ్డుకున్నట్లు ఇరాన్ నౌకాదళం వెల్లడించింది. వాటిలో రెండు ప్రమాదాలకు గురికాగా, మరో రెండు వెనక్కి వెళ్లిపోయినట్లు సమాచారం.
ప్రస్తుత పరిస్థితుల్లో ముడి చమురు ధరలు సమీప కాలంలో బలంగానే కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ధరలు ఇప్పటికే గణనీయంగా పెరగడంతో మధ్య మధ్యలో స్వల్ప స్థిరీకరణ కూడా కనిపించవచ్చని విశ్లేషిస్తున్నారు.