అమెరికాలో ట్రంప్ చిత్రంతో కొత్త డాలర్ నాణెం

15-07-2026 Wed 22:46 | International
Advertisement
  • అమెరికా 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవం సందర్భంగా కొత్త నాణెం
  • ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చిత్రంతో 1 డాలర్ నాణెం విడుదల
  • దేశభక్తికి, స్వేచ్ఛకు ప్రతీకగా ఈ నాణెం అని తెలిపిన ట్రెజరీ విభాగం
  • జీవించి ఉన్న అధ్యక్షులపై నాణేల ముద్రణపై ఉన్న నిబంధనలకు మినహాయింపు
Advertisement
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రంతో కొత్త ఒక డాలర్ ($1) నాణేన్ని ముద్రించనున్నట్లు యునైటెడ్ స్టేట్స్ మింట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ బుధవారం వెల్లడించారు.

ఈ నాణేనికి ఒకవైపు ట్రంప్ చిత్రం ఉండగా, దానిపై "లిబర్టీ", దిగువన "1776-2026" అనే సంవత్సరాలను ముద్రించారు. చిత్రానికి పక్కన "ఇన్ గాడ్ వుయ్ ట్రస్ట్" అని వాక్యం ఉంటుంది. నాణేనికి రెండో వైపు రెక్కలు విప్పిన గద్ద, దాని మధ్యలో 250వ సంఖ్యతో కూడిన రక్షణ కవచం (షీల్డ్) ఉంటుంది. దానిపై "యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా", "వన్ డాలర్" అనే అక్షరాలు ఉంటాయి.

ఈ సందర్భంగా స్కాట్ బెస్సెంట్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, "అమెరికా 250 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల వేళ, స్వేచ్ఛకు, దేశభక్తికి చిహ్నంగా ఈ కొత్త బంగారు నాణేన్ని యూఎస్ మింట్ ముద్రించనుంది. ట్రంప్ చిత్రంతో కూడిన ఈ నాణెం అమెరికా విలువలను, స్వేచ్ఛను పరిరక్షిస్తామన్న దేశ నిబద్ధతను చాటుతుంది" అని పేర్కొన్నారు.

సాధారణంగా అమెరికాలో జీవించి ఉన్న అధ్యక్షుల చిత్రాలను కరెన్సీపై ముద్రించకూడదనే నిబంధన ఉంది. అయితే, 250వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికల కోసం చట్టంలో మినహాయింపులు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. గతంలో 1926లో అప్పటి అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ చిత్రంతో నాణేన్ని విడుదల చేసిన ఉదాహరణను ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

ట్రంప్ చిత్రంతో డాలర్ నాణేన్ని ఎప్పుడు విడుదల చేస్తారు, ఎన్ని ముద్రిస్తారు అనే వివరాలను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. కాగా, ఈ నిర్ణయంపై ప్రస్తుతం మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement
Donald TrumpUS MintOne Dollar CoinAmerica 250th AnniversaryUnited States TreasuryScott Bessent

More Telugu News

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37
..more