లండన్‌లో 'హల్దీరామ్స్' హంగామా... తొలి అవుట్ లెట్ ముందు భారీ క్యూలైన్లు
- లండన్‌లోని లీసెస్టర్ స్క్వేర్‌లో తన మొదటి అవుట్‌లెట్‌ను ప్రారంభించిన హల్దీరామ్స్
- స్టోర్ బయట గంటల తరబడి బారులు తీరిన ప్రవాస భారతీయులు
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన క్యూలైన్ వీడియోలు
- భారతీయ రుచుల పట్ల ఉన్న ఆదరణకు ఇది నిదర్శనమని వ్యాఖ్యలు
- 'ఢిల్లీ పిలిచింది, లండన్ పలికింది' అంటూ హల్దీరామ్స్ ఆసక్తికర పోస్ట్
భారతదేశంలో స్నాక్స్, స్వీట్లకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ బ్రాండ్ ‘హల్దీరామ్స్’ ఇప్పుడు లండన్ వాసులను పలకరించింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో తన మొట్టమొదటి అవుట్‌లెట్‌ను లండన్‌లోని ప్రఖ్యాత లీసెస్టర్ స్క్వేర్‌లో ప్రారంభించింది. ఈ వార్త తెలియగానే, అక్కడి ప్రవాస భారతీయులు భారీ సంఖ్యలో స్టోర్‌కు పోటెత్తారు. దీంతో స్టోర్ బయట కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఏర్పడ్డాయి.
ప్రస్తుతం ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘views.we.explore’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో, భారతీయులు ఎంతో ఓపికగా క్యూలో నిలబడి ఉండటం కనిపిస్తుంది. ‘ఈ వారాంతంలో ప్రతి దేశీ ప్లాన్ ఇదేనేమో’ అనే వ్యాఖ్యతో ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తమ స్టోర్‌కు లభించిన అపూర్వ స్పందనపై హల్దీరామ్స్ కూడా స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో "ఢిల్లీ పిలిచింది... లీసెస్టర్ స్క్వేర్ సమాధానమిచ్చింది" అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యను పోస్ట్ చేసింది.
1937లో రాజస్థాన్‌లోని బికనీర్‌లో ప్రారంభమైన హల్దీరామ్స్, దశాబ్దాలుగా భారతీయుల ఆదరాభిమానాలను చూరగొంటోంది. ఇప్పుడు యూకేలో తొలిసారిగా రెస్టారెంట్ తరహాలో స్టోర్ తెరవడంతో, లండన్‌లోని ప్రవాస భారతీయులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను, భారతీయ రుచులను గుర్తుచేసుకుంటున్నారు. ముఖ్యంగా చాట్, సమోసాలు, జిలేబీ, రసమలయ్ వంటి స్వీట్లు, థాలీల కోసం అక్కడి వారు లొట్టలు వేస్తున్నారు.
ఈ పరిణామంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. భారతీయులు ఇంత క్రమశిక్షణతో క్యూలో నిల్చోవడం చూసి కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తుండగా, హల్దీరామ్స్ ఉత్పత్తులు ఇప్పటికే అక్కడి ఇండియన్ స్టోర్స్‌లో దొరుకుతున్నాయని, దీనికి ఇంత హైప్ అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, విదేశీ గడ్డపై ఒక భారతీయ బ్రాండ్‌కు ఇంతటి ఆదరణ లభించడం పట్ల ఎక్కువ మంది గర్వంగా ఫీలవుతున్నారు. భారతీయ ఆహారానికి ఉన్న ప్రపంచవ్యాప్త ఆదరణకు ఈ సంఘటనే నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.