రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. మీ ద‌గ్గ‌ర ఇంకా ఆ నోట్లు ఉన్నాయా?

RBI key announcement on 2000 rupee notes do you still have them
  • రూ.2000 నోట్లపై తాజా వివరాలు వెల్లడించిన ఆర్బీఐ
  • చెలామణిలోని 98.47 శాతం నోట్లు బ్యాంకులకు వాపస్
  • ప్రస్తుతం మార్కెట్‌లో రూ.5,451 కోట్ల విలువైన నోట్లు మాత్రమే
  • ఈ నోట్లు ఇప్పటికీ చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని స్పష్టీకరణ
  • నోట్లను మార్చుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో ఇప్పటికీ సౌకర్యం
దేశంలో చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో దాదాపు 98.47 శాతం వెనక్కి వచ్చినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వెల్లడించింది. దాదాపు మూడేళ్ల క్రితం ఈ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ, తాజాగా ప్రస్తుత పరిస్థితిపై గణాంకాలను విడుదల చేసింది.

కరెన్సీ నిర్వహణలో భాగంగా 2023 మే 19న రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మార్కెట్‌లో మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఉన్నాయి. తాజా గణాంకాల ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి చెలామణిలో ఉన్న నోట్ల విలువ కేవలం రూ.5,451 కోట్లకు పడిపోయిందని ఆర్బీఐ తెలిపింది.

రూ.2000 నోట్లను మార్చుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాల్లో ఇప్పటికీ సౌకర్యం అందుబాటులో ఉంది. నోట్లను ఉపసంహరించుకున్నప్పటికీ, అవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని (లీగల్ టెండర్) ఆర్బీఐ మరోసారి స్పష్టం చేసింది. ప్రజల వద్ద ఉన్న నోట్లను ఆర్బీఐ కార్యాలయాల్లో డిపాజిట్ చేయడం లేదా ఇతర నోట్లతో మార్చుకోవడం చేయవచ్చని సూచించింది.
Advertisement
Reserve Bank of India
2000 rupee notes
currency withdrawal
RBI issue offices
legal tender status
Indian currency update

More Telugu News