హైదరాబాద్లో ఇల్లు కొనడం భారమే.. 7 నగరాల్లో అమ్మకాలు డౌన్
- 7 నగరాల్లో 6% తగ్గిన ఇళ్ల అమ్మకాలు
- 1.06 లక్షల కొత్త ఇళ్లు మార్కెట్లోకి
- మధ్యతరగతికి అందని ఇళ్ల ధరలు
- లగ్జరీ ప్రాజెక్టులపై డెవలపర్ల దృష్టి
- ధరలు, వడ్డీల భారం పెరగడంతో కొనుగోళ్లు తగ్గుదల
- అందుబాటు ధరలో లేకపోవడమే అసలు సమస్య
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, పుణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా నగరాల్లో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో గృహ విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే ఆరు శాతం తగ్గాయి. అయితే ఇది రియల్ ఎస్టేట్ రంగంలో సంక్షోభానికి సంకేతం కాదని నిపుణులు చెబుతున్నారు. మధ్యతరగతికి ఇళ్లు అందుబాటు ధరల్లో లేకపోవడమే అసలు సమస్య అని స్పష్టం చేశారు.
మరోవైపు ఇదే కాలంలో డెవలపర్లు సుమారు 1.06 లక్షల కొత్త ఇళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. గతేడాదితో పోలిస్తే ఇది ఏడు శాతం ఎక్కువ. దీర్ఘకాలంలో గృహ రంగంపై తమకు నమ్మకం ఉందనే సంకేతంగా దీన్ని నిపుణులు చెబుతున్నారు. పట్టణీకరణ, మౌలిక సదుపాయాల విస్తరణ, సొంత ఇల్లు కొనాలనే ఆసక్తి ఇంకా కొనసాగుతున్నాయని వారు పేర్కొంటున్నారు.
అయితే ఇటీవల డెవలపర్లు విలాసవంతమైన, అత్యంత ఖరీదైన గృహ ప్రాజెక్టులపైనే ఎక్కువ దృష్టి పెట్టడంతో అందుబాటు ధరల ఇళ్లు, మధ్యతరగతి కోసం నిర్మించే గృహాలు తగ్గిపోయాయని రియల్ ఎస్టేట్ విశ్లేషకులు అంటున్నారు. దీంతో ఎక్కువ మంది కొనుగోలుదారులు ఉన్న విభాగానికే తక్కువ ఇళ్లు అందుబాటులోకి వస్తున్న పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.
ఇళ్ల ధరలు కుటుంబాల ఆదాయంతో పోలిస్తే వేగంగా పెరగడం విక్రయాలపై ప్రభావం పడుతోందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. గృహ రుణాలపై వడ్డీ భారం, నిర్మాణ వ్యయాలు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఖర్చులు పెరగడ కూడా మధ్యతరగతిపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. నెలకు రూ.లక్ష ఆదాయం ఉన్న కుటుంబాలు కూడా నగరాల్లో ఇల్లు కొనాలంటే ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని వివరించారు. దీంతో చాలామంది కొనుగోలును వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మరికొందరు చిన్న ఇళ్లతో లేదా నగర శివార్లతో సరిపెట్టుకుంటున్నారు.
మధ్యతరగతికి అందుబాటు ధరల్లో గృహాలు నిర్మించడం ద్వారా ఇళ్ల మార్కెట్ మళ్లీ పుంజుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రుణ సదుపాయాలను మెరుగుపరచడం, ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు అమలు చేయడం, మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడం ద్వారా సానుకూల ప్రభావం ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశంలో గృహాలకు డిమాండ్ తగ్గలేదని, వాటిని కొనుగోలు చేసే స్తోమత మాత్రం తగ్గిందని వారు స్పష్టం చేస్తున్నారు.