కొరియాలో మంత్రి లోకేశ్ పర్యటన.. బుసాన్‌కు రైలులో ప్రయాణం
- దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్
- సియోల్ నుంచి బుసాన్ నగరానికి రైలులో ప్రయాణం
- ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్న లోకేశ్
- సాయంత్రం షూ ఫ్యాక్టరీని సందర్శించనున్న మంత్రి
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియాలో తన పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన బుధవారం సియోల్ నుంచి ఆ దేశ వాణిజ్య నగరమైన బుసాన్‌కు రైలులో బయలుదేరి వెళ్లారు. బుసాన్‌లో ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
బుసాన్‌లో 'ఏపీఈడీబీ' (Andhra Pradesh External Engagement-Korea) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'అపెక్స్-కొరియా' విభాగాన్ని మంత్రి లోకేశ్ ఈ ఉదయం ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే కొరియా పారిశ్రామికవేత్తలకు ఇది ఒక సహాయక, అనుసంధాన కేంద్రంగా పనిచేస్తుంది. అనంతరం కొరియా మెరైన్ ఎక్విప్‌మెంట్ అసోసియేషన్ (కేఓఎంఈఏ) నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేశ్ పాల్గొని, ఏపీలో ఉన్న అవకాశాలను వివరించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా బీఎన్‌కే ఫైనాన్షియల్, బూయాంగ్ గ్రూప్, హ్యుంగ్ సాంగ్ గ్రూప్ వంటి ప్రముఖ సంస్థల ఉన్నత స్థాయి ప్రతినిధులతో లోకేష్ సమావేశం కానున్నారు. సాయంత్రం స్థానిక షూఆల్స్ ఫుట్‌వేర్ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. తన కార్యక్రమాలను ముగించుకుని రాత్రికి తిరిగి బుసాన్ నుంచి సియోల్ చేరుకుంటారు.