మహిళల టీ20 వరల్డ్ కప్... ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నీలో శ్రీచరణికి స్థానం
- మహిళల T20 వరల్డ్ కప్ 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్' ప్రకటన
- ఛాంపియన్ ఆస్ట్రేలియా నుంచి ఐదుగురు క్రీడాకారిణులకు చోటు
- భారత్ నుంచి యువ స్పిన్నర్ శ్రీ చరణికి స్థానం
- టోర్నీలో అత్యధిక వికెట్లు తీసి రికార్డు సృష్టించిన శ్రీ చరణి
- ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఆసీస్ కీపర్ బెత్ మూనీ
ఇటీవల ముగిసిన మహిళల టీ20 ప్రపంచకప్-2026కు సంబంధించి 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్'ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) సోమవారం ప్రకటించింది. ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి ఏడోసారి విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా, ఈ జట్టులోనూ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. టోర్నీలో అత్యధిక వికెట్లతో రాణించిన భారత యువ స్పిన్నర్ శ్రీ చరణి ఈ ప్రతిష్ఠాత్మక జట్టులో స్థానం దక్కించుకుంది.
ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా నుంచి ఏకంగా ఐదుగురు క్రీడాకారిణులు ఈ జట్టులో చోటు సంపాదించారు. ఫైనల్లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలవడమే కాకుండా, టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును గెలుచుకున్న ఆసీస్ వికెట్ కీపర్ బెత్ మూనీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఆమె ఈ టోర్నీలో మొత్తం 238 పరుగులు సాధించింది.
భారత్ నుంచి ఈ జట్టులో చోటు దక్కించుకున్న ఏకైక క్రీడాకారిణి శ్రీ చరణి. ఈ యువ స్పిన్నర్ కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 8.35 సగటుతో 14 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించింది. తద్వారా ఒకే మహిళల టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. మరోవైపు, ఇంగ్లండ్ ఓపెనర్ డాని వ్యాట్-హాడ్జ్ 302 పరుగులతో టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా నిలిచింది.