పాతబస్తీలో పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిపివేత!

Hyderabad Old City water supply interrupted in several areas
  • అల్లాబండ రిజర్వాయర్ వద్ద మరమ్మతుల కారణంగా నిలిపివేత
  • సోమవారం ఉదయం 6 నుంచి మంగళవారం ఉదయం 6 వరకు అంతరాయం
  • గోల్కొండ జోన్ పరిధిలోని పలు ప్రాంతాలపై ప్రభావం
హైదరాబాద్ పాతబస్తీ వాసులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ) కీలక ప్రకటన విడుదల చేసింది. గోషామహల్ పరిధిలోని అల్లాబండ రిజర్వాయర్ వద్ద చేపడుతున్న అత్యవసర మరమ్మతుల కారణంగా జూలై 6, సోమవారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ పనులు మంగళవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయని జలమండలి అధికారులు వెల్లడించారు.

10 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల అల్లాబండ రిజర్వాయర్ ఇన్లెట్, అవుట్‌లెట్ పైప్‌లైన్ల వద్ద భారీ లీకేజీలు ఏర్పడటంతో, వాటిని అరికట్టేందుకు బటర్‌ ఫ్లై వాల్వులను మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఈ మరమ్మతుల నేపథ్యంలో గోల్కొండ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది.

ప్రభావితమయ్యే ప్రాంతాలు

జూలై 7 (మంగళవారం): సబ్జీమండీ, గంగానగర్, ఉస్మానియా, బేరమ్ గల్లీ, గంగామాత, జాలి హనుమాన్, ఆజం గల్లీ, రహింపురా, పురానాపూల్, చూడీ బజార్, ఉస్మానియా ఆసుపత్రి పరిసరాలు, శంకర్ బజార్, జుమ్మేరాత్ బజార్‌ ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది.

మరమ్మతుల కారణంగా ఈ ఉదయం జిర్రా, ఇందిరా నగర్, హరి దర్గా, కుమ్మరవాడి, టప్పాచబుత్రా, ఆకాష్‌పురి, షిబ్లీ హిల్స్, బిలాల్ మసీదు పరిసరాలు, గోడే కీ ఖబర్, జాలి హనుమాన్, జంగూర బస్తీ, అబు షటాకియా, 2జె బస్ స్టాప్, జియాగూడ, కార్వాన్ ప్రాంతాల్లో నీటి సరఫరాపై ప్రభావం పడింది.
HMWSSB
Hyderabad water supply cut
Old City water interruption
Allabanda reservoir repairs

More Telugu News