సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. వర్చువల్‌గా కోర్టుకు హాజరైన అల్లు అర్జున్
- మిగతా నిందితులు రాకపోవడంతో విచారణ జులై 29కి వాయిదా
- పుష్ప-2 సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి
- ఈ కేసులో అల్లు అర్జున్ను 11వ నిందితుడిగా చేర్చిన పోలీసులు
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ సోమవారం నాంపల్లి క్రిమినల్ కోర్టు ఎదుట వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ కేసులో మరికొందరు నిందితులు విచారణకు గైర్హాజరు కావడంతో, న్యాయస్థానం తదుపరి విచారణను జులై 29కి వాయిదా వేసింది.
2024 డిసెంబర్ 4న 'పుష్ప 2: ది రూల్' చిత్ర ప్రత్యేక ప్రదర్శన సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో రేవతి (35) అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ బాలుడు సుదీర్ఘకాలం పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన చిక్కడపల్లి పోలీసులు, భద్రతా లోపాలు మరియు నిర్వాహకుల వైఫల్యాలను గుర్తించారు. ఈ మేరకు 2025 డిసెంబర్లో న్యాయస్థానానికి 500 పేజీల చార్జిషీట్‌ను పోలీసులు సమర్పించారు. ఇందులో అల్లు అర్జున్ను 11వ నిందితుడిగా పేర్కొన్నారు. ఈ కేసులో థియేటర్ యాజమాన్యంతో పాటు, బన్నీ బౌన్సర్లు సహా మొత్తం 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు.
సోమవారం జరిగిన విచారణ సమయంలో అల్లు అర్జున్ ముంబైలో షూటింగ్లో ఉండటంతో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు కోర్టు అనుమతించింది.
అప్పట్లో ఘటన జరిగిన అనంతరం అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేయగా, ఆ తర్వాత ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది. బాధితురాలి కుటుంబానికి అల్లు అర్జున్, ఆయన కుటుంబ సభ్యులు మరియు 'పుష్ప-2' చిత్రబృందం ఆర్థిక సహాయాన్ని అందించారు.