ఏపీలో ఆరుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ
- ఆరుగురు యువ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం
- అడ్మిన్ ఓఎస్డీగా నవజ్యోతి మిశ్రా బదిలీ
- నంద్యాల జిల్లా ఏఎస్పీగా సుస్మిత బదిలీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు శాఖలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. పలు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు యువ ఐపీఎస్ అధికారులను తక్షణమే బదిలీ చేస్తూ, వారికి కొత్త పోస్టింగులు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీ అయిన అధికారులు, వారికి కేటాయించిన కొత్త బాధ్యతల వివరాలు:
| అధికారి పేరు | పాత పోస్టింగ్ | కొత్త పోస్టింగ్ - బదిలీ అయిన స్థానం |
| నవజ్యోతి మిశ్రా | చింతపల్లి ఏఎస్పీ | ఓఎస్డీ (అడ్మిన్), మార్కాపురం జిల్లా |
| పాటిల్ దేవరాజ్ మనీశ్ | కాకినాడ ఏఎస్పీ | అదనపు ఎస్పీ (అడ్మిన్), తూర్పు గోదావరి జిల్లా (రాజమహేంద్రవరం) |
| మందా జావళి అల్ఫోన్స్ | నంద్యాల ఏఎస్పీ | ఓఎస్డీ (అడ్మిన్), పోలవరం జిల్లా |
| మనోజ్ రామనాథ్ హెగ్డే | రాజంపేట్ ఏఎస్పీ | ఓఎస్డీ (లా అండ్ ఆర్డర్), అమరావతి |
| రోహిత్ కుమార్ చౌదరి | తాడిపత్రి ఏఎస్పీ | అదనపు ఎస్పీ (అడ్మిన్), పల్నాడు జిల్లా |
| సుస్మిత | జంగారెడ్డిగూడెం ఏఎస్పీ | ఏఎస్పీ, నంద్యాల |