మృత్యుంజయుడు.. 8 రోజుల తర్వాత శిథిలాల నుంచి సజీవంగా

Conqueror of Death Alive from Rubble after 8 Days
  • వెనిజువెలాలో జూన్‌ 24న వరుస భూకంపాలు
  • కుప్పకూలిన 7 అంతస్తుల భవనం
  • ఎనిమిది రోజుల తర్వాత శిథిలాల నుంచి బయటపడ్డ ఫ్లోరెస్‌
  • సెక్యూరిటీ క్యాబిన్‌లో చిక్కుకున్న గార్డ్‌
  • గుర్తించి నీళ్లు, ద్రవ ఆహారం అందించిన సహాయక సిబ్బంది
  • ఏదైనా జరిగితే బాధపడుతుందని, భార్యకు చెప్పొద్దని వేడుకోలు
వెనిజువెలా భూకంప రక్షణ చర్యల్లో అద్భుతం ఆవిష్కృతమైంది. విపత్తు సంభవించి ఎనిమిది రోజులు గడిచింది. అయినా భవనం శిథిలాల కింది నుంచి ఓ వ్యక్తిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. అతడే 43 ఏళ్ల సెక్యూరిటీ గార్డు హెర్నాన్ అల్బెర్టో గిల్ ఫ్లోరెస్‌. రక్షక సిబ్బంది అతణ్ని చేరుకోగానే ఫ్లోరెస్‌ చెప్పిన తొలి మాట అందరినీ కంటతడి పెట్టించింది. ‘‘నేను బతికున్నానని నా భార్యకు ఇప్పుడే చెప్పొద్దు. ఒకవేళ ఏదైనా జరిగితే ఆమె మరింత బాధపడుతుంది’’ అని అతడు కోరాడు.

జూన్ 24న వరుసగా 7.2, 7.5 తీవ్రతతో భూకంపాలు రావడంతో ఏడు అంతస్తుల భవనం కూలిపోయింది. ఆ సమయంలో నైట్ షిఫ్ట్‌లో ఉన్న ఫ్లోరెస్ సెక్యూరిటీ క్యాబిన్‌లోనే చిక్కుకున్నాడు. భవనం కూలిపోయినా క్యాబిన్ పూర్తిగా ధ్వంసం కాకపోవడంతో లోపల కొద్దిపాటి గాలి చేరి అతడు ప్రాణాలతో బయటపడగలిగాడు.

కోస్టారికా రెడ్‌క్రాస్ బృందం మొదట అతడి జాడ గుర్తించింది. టెలిస్కోప్ కెమెరాతో అతడితో మాట్లాడుతూ నీరు, ద్రవ ఆహారం అందించింది. చిలీ, అమెరికా, మెక్సికో, పోర్చుగల్, ఎల్ సాల్వెడార్, వెనిజువెలా బృందాలు కలిసి 100 గంటలకు పైగా శ్రమించాయి. మూడు మీటర్ల సొరంగం తవ్వి చివరకు అతణ్ని బయటకు తీశాయి.

సాధారణంగా భూకంపం సంభవించిన తర్వాత 48 నుంచి 72 గంటల్లోనే ప్రాణాలతో బయటపడే అవకాశాలు తగ్గిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఎనిమిది రోజుల తర్వాత ఫ్లోరెస్ సజీవంగా బయటపడటం అద్భుతంగా మారింది. ఈ రక్షణ చర్యలో పాల్గొన్న అంతర్జాతీయ బృందాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Hernan Alberto Gil Flores
Venezuela earthquake rescue
Survivor after 8 days
Building collapse miracle
International rescue mission
Venezuela earthquake survivor

More Telugu News