జగన్ చెప్పే 'మావిగన్' పేరు వింటేనే నవ్వు వస్తుంది: విష్ణుకుమార్ రాజు

Vishnu Kumar Raju says he laughs hearing Jagan mention Mavigan name
  • వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అన్న జగన్
  • అమరావతిపై బురదజల్లేందుకు కొత్త డ్రామాకు తెరలేపారన్న విష్ణు రాజు
  • మావిగన్ అంశమే జగన్‌కు హానికరంగా మారుతుందని హెచ్చరిక
ఏపీ రాజధానిగా 'మావిగన్'కే తాము కట్టుబడ్డి ఉన్నామని వైసీపీ అధినేత జగన్ ఈరోజు మరోసారి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా జరుగుతాయని ఆయన అన్నారు. మేనిఫెస్టోలో కూడా 'మావిగన్'ను పేర్కొంటామని తెలిపారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. "జగన్ చెబుతున్న ‘మావిగన్’ పేరు వింటేనే నాకు నవ్వొస్తోంది. మేనిఫెస్టో అంటే ప్రజలు అంగీకరించేలా ఉండాలి" అంటూ ఎద్దేవా చేశారు.

రాజధాని అమరావతిపై మళ్లీ బురదజల్లేందుకే జగన్ ఈ కొత్త డ్రామాకు తెరలేపారని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. గతంలో మూడు రాజధానుల ముచ్చట చెబితే... రాష్ట్ర ప్రజలు వైసీపీని ఇంటికి పంపించారని అన్నారు. ఇప్పుడు మళ్లీ సరికొత్తగా ‘మావిగన్’ పేరు చెప్పి ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి చెందుతున్న అమరావతిని దెబ్బతీయాలని చూస్తే... రాబోయే రోజుల్లో జగన్‌కు ఈ ‘మావిగన్’ అంశమే రాజకీయంగా తీవ్ర హానికరంగా మారుతుందని హెచ్చరించారు.


Vishnu Kumar Raju
YS Jagan Mohan Reddy
Mavigan Capital
Andhra Pradesh Elections
Amaravati vs Mavigan
BJP YSRCP Politics

More Telugu News