టీఎంసీ మహిళా ఎంపీపై కోడిగుడ్లతో దాడి
- బెంగాల్ లో బీజేపీ విజయం సాధించిన తర్వాత పెరిగిన రాజకీయ హింస
- టీఎంసీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు
- పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తుండగా మహువా మొయిత్రాపై దాడి
బీజేపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు మహువా ఆరోపించారు. రాష్ట్ర పోలీసుల వైఫల్యమే ఇలాంటి ఘటనలకు కారణమని ఆమె విమర్శించారు. ఇప్పటికే టీఎంసీ ముఖ్య నాయకుడు అభిషేక్ బెనర్జీ, మాజీ మంత్రులపై కూడా దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బీజేపీ ఇంకా స్పందించలేదు. బెంగాల్‌లో ప్రతిపక్ష నాయకులపై జరుగుతున్న దాడుల కారణంగా అక్కడి రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారుతోంది.