మూడెకరాల రైతులకు శుభవార్త.. రైతు భరోసా నిధులు జమ

Rythu Bharosa funds deposited for farmers with up to three acres
  • 10.68 లక్షల మందికి లబ్ధి
  • రూ.1,590.02 కోట్లు జమ
  • డీబీటీ ద్వారా ఖాతాల్లోకి నిధులు
  • ఇప్పటివరకు రూ.4,072.04 కోట్లు విడుదల
  • 54.96 లక్షల మంది రైతులకు లబ్ధి
తెలంగాణలో వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ రెండో రోజూ కొనసాగింది. ప్రభుత్వం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మూడెకరాల వరకు భూమి ఉన్న రైతులందరి బ్యాంకు ఖాతాల్లోకి బుధవారం నిధులను డీబీటీ విధానంలో నేరుగా జమ చేసింది.

ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 10.68 లక్షల మంది రైతులకు రూ.1,590.02 కోట్ల పెట్టుబడి సాయం అందనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 54.96 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మొత్తం రూ.4,072.04 కోట్ల నిధులను విజయవంతంగా బదిలీ చేసినట్లు తెలిపింది. వానాకాలం సాగు ప్రారంభమైన వేళ ఎరువులు, విత్తనాల కొనుగోలుకు ఈ సాయం ఉపయోగపడుతుండటంతో రైతులు సాగు పనులను వేగవంతం చేస్తున్నారు.
Rythu Bharosa
Telangana Government
Farmer Investment Support
Kharif Season Funds
DBT Payment Telangana
Telangana Agriculture News

More Telugu News