ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్‌కు దక్కని ఊరట... సస్పెన్షన్‌లోనే నేడు రిటైర్మెంట్
- సీనియర్ ఐపీఎస్ సునీల్ కుమార్‌కు క్యాట్‌లో చుక్కెదురు
- సస్పెన్షన్ ఎత్తివేయాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన ట్రైబ్యునల్
- నేటితో ముగియనున్న సునీల్ కుమార్ సర్వీస్
- సస్పెన్షన్‌లోనే పదవీ విరమణ ఉత్తర్వులు జారీకి ప్రభుత్వం నిర్ణయం
ఈరోజు ఈ పిటిషన్‌పై వాదనలు విన్న ట్రిబ్యునల్, సునీల్ కుమార్ అభ్యర్థనను తిరస్కరించింది. క్యాట్ తీర్పు వెలువడిన వెంటనే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సునీల్ కుమార్‌ను సస్పెన్షన్‌లోనే పదవీ విరమణ చేయించాలని నిర్ణయించింది. ఈ రోజు (జూన్ 30) సాయంత్రం కార్యాలయ పనివేళలు ముగిసిన తర్వాత ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనుంది.
తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ కుమార్, తన సస్పెన్షన్‌ను పలుమార్లు సవాలు చేశారు. అనధికారికంగా విదేశీ పర్యటనలకు వెళ్లడం సహా మరికొన్ని అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనపై విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం ఆయన సస్పెన్షన్‌ను పలు దఫాలుగా పొడిగిస్తూ వచ్చింది. తాజాగా క్యాట్‌లోనూ ఊరట లభించకపోవడం, సర్వీస్ చివరి రోజున సస్పెన్షన్‌లోనే రిటైర్ కానుండటం ఆయనకు మరో పెద్ద ఎదురుదెబ్బగా మారింది.