6000mAh బ్యాటరీ, 6 ఏళ్ల సపోర్ట్.. శాంసంగ్ నుంచి కొత్త గెలాక్సీ ఫోన్
- గెలాక్సీ ఎం47 5జీ ఫోన్లో 120Hz అమోలెడ్ డిస్ప్లే
- 50MP ట్రిపుల్ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా
- 45W ఫాస్ట్ ఛార్జింగ్
- ప్రారంభ ధర రూ.22,999
- జులై 4 నుంచి అమ్మకాలు
ఈ ఫోన్లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ రక్షణ కూడా ఉంది. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పాటు LPDDR5X ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ను అందించారు. దీంతో రోజువారీ వినియోగంతో పాటు గేమింగ్కూ అనువుగా ఉంటుంది.
ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. దీనికి 5 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు జత చేశారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్లో 6000mAh భారీ బ్యాటరీ ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. గేమింగ్ సమయంలో ఉపయోగపడే బైపాస్ ఛార్జింగ్ ఫీచర్‌ను కూడా అందించారు.
ఈ ఫోన్లో శాంసంగ్ వన్ యూఐ అందుబాటులో ఉంటుంది. ఆబ్జెక్ట్ ఎరేజర్, ఎడిట్ సజెషన్, మై ఫిల్టర్ వంటి ఏఐ ఫీచర్లు ఉన్నాయి. ఫొటోలు, సోషల్ మీడియా కంటెంట్ రూపొందించే వారికి ఇవి ఉపయోగపడతాయని కంపెనీ చెబుతోంది. లాంఛ్ ఆఫర్లతో కలిపి ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.22,999గా నిర్ణయించారు. జులై 4 నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. రోగ్ రెడ్, బ్లేజ్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.