నెల్లూరు రొట్టెల పండుగ... తన తమ్ముడు ఎమ్మెల్యే కావాలంటూ రొట్టెను వదిలిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Kotamreddy Sridhar Reddy leaves bread at Nellore Rottela Panduga for brother MLA seat
  • నెల్లూరు రొట్టెల పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
  • సోదరుడు గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని రొట్టె పంచుకున్న వైనం
  • చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని సక్రమంగా నడపాలని ఆకాంక్ష
  • నియోజకవర్గంలో రూ.700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడి
నెల్లూరులో వైభవంగా జరుగుతున్న చారిత్రక రొట్టెల పండుగలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. తన అర్ధాంగి సుజిత, సోదరుడు గిరిధర్ రెడ్డితో కలిసి ఆదివారం ఆయన బారా షహీద్ దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా స్వర్ణాల చెరువులో రొట్టెలు వదిలి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కోటంరెడ్డి.. తాను పంచుకున్న మూడు రొట్టెల గురించి వివరించారు. తన సోదరుడు గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటూ మొదటి రొట్టెను మార్చుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షిస్తూ రెండో రొట్టెను పంచుకున్నట్లు చెప్పారు. భారీ పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చాలనేది తన మూడో కోరిక అని వివరించారు.

గత 12 ఏళ్లుగా రొట్టెల పండుగకు రావడం ఒక కుటుంబ సెంటిమెంట్‌గా మారిందని కోటంరెడ్డి అన్నారు. గత రెండేళ్లలో తన నియోజకవర్గంలో సుమారు రూ.700 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని, దర్గా అభివృద్ధికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఏటా జరిగే ఈ ఉత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు.
Kotamreddy Sridhar Reddy
Rottela Panduga Nellore
Bara Shahid Dargah
Kotamreddy Giridhar Reddy
Nellore Rural MLA
Andhra Pradesh Politics

More Telugu News