ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే.. ఆరోగ్యానికి ఐదు ప్రయోజనాలు
- ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే హైడ్రేషన్
- జీర్ణక్రియ మెరుగుపడే అవకాశం
- రక్తపోటు నియంత్రణకు తోడ్పాటు
- కిడ్నీల పనితీరుకు మేలు
- సహజ శక్తిని అందించే పానీయం
- రోజుకు ఒక గ్లాస్ చాలు
తక్షణ హైడ్రేషన్: రాత్రంతా ఉపవాసం తర్వాత శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు శరీరాన్ని త్వరగా హైడ్రేట్ చేస్తాయి.
జీర్ణక్రియకు తోడ్పాటు: సహజ ఎంజైమ్లు ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.
గుండె ఆరోగ్యానికి మేలు: పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణకు సాయపడుతుంది. దీంతో గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా ఉపయోగపడుతుంది.
కిడ్నీల పనితీరుకు: కొబ్బరి నీళ్లు సహజ మూత్రవిసర్జనను పెంచుతాయి. దీంతో శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లడంతో పాటు కిడ్నీ రాళ్ల ప్రమాదం కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
సహజ శక్తి: టీ, కాఫీపై ఆధారపడకుండా సహజ చక్కెరలు, ఖనిజాల ద్వారా శరీరానికి శక్తిని అందిస్తుంది. అలసట తగ్గి రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు దోహదపడుతుంది.
జాగ్రత్తలు కూడా అవసరం
అయితే కొబ్బరి నీళ్లు అధికంగా తాగడం మంచిది కాదు. ఎక్కువగా తీసుకుంటే శరీరంలో పొటాషియం స్థాయులు పెరిగి కిడ్నీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కొందరికి కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా రావచ్చు. కిడ్నీ వ్యాధులు ఉన్నవారు లేదా పొటాషియం పరిమితంగా తీసుకోవాల్సినవారు వైద్యుల సలహాతో మాత్రమే తాగాలి.
ఎలా తాగితే మంచిది?
తాజా కొబ్బరి నీళ్లనే తాగాలి. ఉదయం ఖాళీ కడుపుతో 200–250 మిల్లీలీటర్లు తీసుకోవాలి. తాగిన తర్వాత 15–20 నిమిషాల విరామం ఇచ్చి అల్పాహారం తినాలి.