ఓ పాకిస్థానీ టెర్రరిస్టు ద్వారా సల్మాన్ ఖాన్ నన్ను బెదిరిస్తున్నాడు: 'కాలా హిరణ్' నిర్మాత సంచలన ఆరోపణలు

Amit Jani claims Salman Khan is threatening him through a Pakistani terrorist
  • 'కాలా హిరన్' సినిమా నిర్మాత అమిత్ జానీకి హత్య బెదిరింపులు
  • పాకిస్థాన్ నుంచి ఫోన్లు వస్తున్నాయని సంచలన ఆరోపణ
  • డ్రోన్లు, గ్రెనేడ్లతో దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారని వెల్లడి
  • సల్మాన్ ఖాన్ కేసుపై సినిమా తీయడమే దీనికి కారణమని ఆరోపణ
  • కేంద్ర హోం శాఖ, పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడి
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేట కేసు ఆధారంగా తెరకెక్కుతున్న 'కాలా హిరణ్' సినిమా విడుదల కాకముందే తీవ్ర వివాదాల్లో చిక్కుకుంటోంది. ఈ సినిమాను నిర్మిస్తున్న అమిత్ జానీ, తనకు పాకిస్థాన్ నుంచి హత్య బెదిరింపులు వస్తున్నాయని గురువారం సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఉగ్రవాది ద్వారా సల్మాన్ ఖాన్ ఈ బెదిరింపులకు పాల్పడుతన్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

సల్మాన్ ఖాన్‌కు మద్దతుగా, పాకిస్థాన్‌కు చెందిన షహజాద్ భట్టి అనే ఉగ్రవాది తనకు ఫోన్లు, మెసేజ్‌లు చేసి బెదిరిస్తున్నాడని అమిత్ జానీ ఆరోపించారు. "డ్రోన్లు, గ్రెనేడ్లతో దాడి చేసి చంపేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, రాజస్థాన్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చాను" అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ తన 'టూల్‌కిట్' ద్వారా ఇప్పటికే వేల బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

"గతంలో డి-కంపెనీ పేరుతో వచ్చిన బెదిరింపులకే నేను భయపడలేదు. ఇప్పుడు ఈ పాక్ ఉగ్రవాదితో ఫోన్లు చేయిస్తున్నారు. నేను భయపడను. ఒకవేళ నన్ను హత్య చేసినా, నా తర్వాత నా టీమ్ ఈ 'కాలా హిరణ్' సినిమాను విడుదల చేస్తుంది. బిష్ణోయ్ సమాజం చేసిన పోరాటం, త్యాగాల చరిత్రను ప్రపంచానికి చూపిస్తుంది" అని అమిత్ జానీ స్పష్టం చేశారు.

Go Back to Shorts
Amit Jani
Salman Khan
Kala Hiran Movie
Shahzad Bhatti
Blackbuck Poaching Case
Death Threats

More Telugu News