ఇకపై డిగ్రీలు ఉంటే చాలదు.. భవిష్యత్తు చదువులపై ఆర్థిక సలహాదారు కీలక వ్యాఖ్యలు!

National
Advertisement
  • ఎంబీఏల ప్రాధాన్యం తగ్గుతోందన్న సీఈఏ
  • వృత్తి నైపుణ్యాలకు డిమాండ్‌ పెరుగుతోందని వెల్లడి
  • AI భర్తీ చేయలేని ఉద్యోగాలపై దృష్టి పెట్టాలని సూచన
  • ఆరోగ్యం కూడా ఉద్యోగాలకు కీలకమన్న నాగేశ్వరన్‌
  • స్కిల్స్‌, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని యువతకు సూచన
Advertisement
ఒకప్పుడు మంచి డిగ్రీ, ఆ తర్వాత ఎంబీఏ చేస్తే జీవితంలో సెటిల్‌ అయిపోయినట్టే అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారుతున్నాయని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) వి.అనంత నాగేశ్వరన్‌ తెలిపారు. కేవలం డిగ్రీలు, ఉన్నత చదువులపై ఆధారపడకుండా భవిష్యత్తు అవసరాలకు సరిపోయే నైపుణ్యాలను పెంచుకోవాలని యువతకు సూచించారు.

ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆయన.. గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక వెంటనే ఎంబీఏ, పీజీ లేదా యూపీఎస్సీ వంటి పరీక్షల వైపు వెళ్లడం చాలా మంది యువతలో కనిపిస్తున్న ధోరణి అని చెప్పారు. అయితే ఆ చదువులు నిజంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తాయా లేదా అన్న అంశాన్ని కూడా ఆలోచించాలని సూచించారు. సాఫ్ట్‌వేర్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎంబీఏలకు గ్లోబలైజేషన్‌ కాలంలో భారీ డిమాండ్‌ ఉండేదని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయని వ్యాఖ్యానించారు.

భవిష్యత్తులో వెల్డింగ్‌, ప్లంబింగ్‌, కార్పెంట్రీ, ఎలక్ట్రికల్‌ పనుల వంటి వృత్తి నైపుణ్యాలకు మరింత ప్రాధాన్యం పెరుగుతుందని నాగేశ్వరన్‌ అభిప్రాయపడ్డారు. స్విట్జర్లాండ్‌, జర్మనీ, జపాన్‌, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాల్లో ఇలాంటి వృత్తులకు ఎంతో గౌరవం ఉంటుందని గుర్తు చేశారు. అలాగే కౌన్సెలింగ్‌, కేర్‌గివింగ్‌, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో మానవ నైపుణ్యాలను కృత్రిమ మేధస్సు పూర్తిగా భర్తీ చేయలేదని చెప్పారు.

ఆరోగ్యం కూడా ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపుతుందని అనంత నాగేశ్వరన్‌ పేర్కొన్నారు. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడం కంటే ముందే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయనే అంశం ఆందోళన కలిగిస్తోందన్నారు. శారీరక శ్రమ తగ్గడం, వ్యాయామం లేకపోవడం, ఆలస్యంగా భోజనం చేయడం వంటి అలవాట్లు ఊబకాయం పెరగడానికి కారణమవుతున్నాయని చెప్పారు.

సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా, మనిషి ఆలోచన, నిర్ణయాలు తీసుకునే శక్తి, నైపుణ్యం అవసరమైన రంగాల్లోనే భవిష్యత్తు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే యువత డిగ్రీలతో పాటు ప్రాక్టికల్‌ స్కిల్స్‌, వ్యక్తిగత ఆరోగ్యంపైనా సమానంగా దృష్టి పెట్టాలని సూచించారు.
Advertisement

సంబంధిత వార్తలు

V Anantha NageswaranChief Economic AdvisorFuture of EducationSkill DevelopmentVocational TrainingJob Opportunities in India

More Telugu News

నవంబర్ 11 నుంచి కేటీఆర్ బస్సు యాత్ర.. 29న భారీ బహిరంగ సభ

02 Nov, 12:02

పంజాబ్‌లో ఆప్‌కు షాక్‌.. రాజీనామా చేసిన గంటల్లోనే బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు!

02 Nov, 11:57

పులివెందుల పులి అన్నారు.. ఓటేయకుండా వెళ్లారు: జగన్‌పై అచ్చెన్న విమర్శలు

02 Nov, 11:48

పోలీసు శాఖకు వన్నె తెచ్చిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం.. సమర్థుడైన అధికారి: సీఎం చంద్రబాబు నివాళి

02 Nov, 11:44

రైలు బోగీల రంగులు వేర్వేరుగా ఎందుకుంటాయో తెలుసా? నీలం, ఎరుపు, తెలుపు వెనుక అసలు కథ ఇదే!

02 Nov, 11:41

మురసు తుపానుపై పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

02 Nov, 11:35

ప్రేమలో దారుణంగా మోసపోయా: రెజీనా కసాండ్రా

02 Nov, 11:33

ఓట్‌ చోరీ జరిగితే రాహుల్‌, రేవంత్‌ ఎలా గెలిచారు?: రాంచందర్‌ రావు

02 Nov, 11:30

కుటుంబ కలహాలతో విషాదం.. అత్త, కొడుకు, కోడలు ఆత్మహత్యాయత్నం

02 Nov, 11:22

ఎర్రన్నాయుడు వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్

02 Nov, 11:19

తొలి వారాంతంలోనే సత్తా చాటిన 'ఆదర్శ కుటుంబం'.. కలెక్షన్లు ఎంతంటే?

02 Nov, 11:18

హెచ్‌-1బీ వీసా పొడిగింపు ఇకపై సులువు కాదు.. భారతీయ నిపుణులకు ఇబ్బందులు?

02 Nov, 11:16

టీమిండియా కోచ్‌గా మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నా.. గంభీర్‌ కీలక వ్యాఖ్యలు

02 Nov, 11:16

కర్ణాటకలో పెరగనున్న ఆర్టీసీ బస్సు ఛార్జీలు

02 Nov, 11:04

రాప్తాడు ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది.. మంచు మనోజ్‌ భావోద్వేగ పోస్ట్‌

02 Nov, 10:56
..More Telugu News