యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ 2026 ఫలితాలు విడుదల

National
Advertisement
  • మెయిన్స్ పరీక్షకు 13,343 మంది అభ్యర్థుల అర్హత
  • మొత్తం 1,016 పోస్టుల భర్తీకి కొనసాగుతున్న ప్రక్రియ
  • జూన్ 19 నుంచి 28 వరకు మెయిన్స్‌కు దరఖాస్తుల స్వీకరణ
  • అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో అందుబాటులో అర్హుల జాబితా
Advertisement
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష 2026 ఫలితాలను సోమవారం (జూన్ 15) విడుదల చేసింది. ఈ పరీక్షలో దేశవ్యాప్తంగా మొత్తం 13,343 మంది అభ్యర్థులు తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీ తన అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో అందుబాటులో ఉంచింది.

ఈ ఏడాది మే 24న దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. మొత్తం 1,016 సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, మెయిన్స్‌కు ఎంపికైన వారి జాబితాను నేడు ప్రకటించారు. గతేడాది 1,087 ఖాళీలకు 14,161 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

మెయిన్స్‌కు అర్హత పొందిన అభ్యర్థులు తప్పనిసరిగా జూన్ 19 నుంచి జూన్ 28, 2026 మధ్య యూపీఎస్సీ పోర్టల్‌లో లాగిన్ అయి డిటైల్డ్ అప్లికేషన్ ఫామ్ (DAF-I) నింపాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే రూ.200 పరీక్ష ఫీజును చెల్లించాలి. అయితే, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.

అభ్యర్థులు సాధించిన మార్కులు, కటాఫ్ మార్కులు, ఆన్సర్ కీలను సివిల్ సర్వీసెస్ 2026 తుది ఫలితాలు వెలువడిన తర్వాతే ప్రకటిస్తామని యూపీఎస్సీ స్పష్టం చేసింది. ఏవైనా సందేహాలుంటే యూపీఎస్సీ కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చని సూచించింది.
Advertisement

సంబంధిత వార్తలు

UPSCUPSC Civil Services Prelims 2026 ResultsCivil Services Prelims Result 2026UPSC Merit List 2026UPSC DAF I RegistrationUPSC Mains 2026 Qualification

More Telugu News

నవంబర్ 11 నుంచి కేటీఆర్ బస్సు యాత్ర.. 29న భారీ బహిరంగ సభ

02 Nov, 12:02

పంజాబ్‌లో ఆప్‌కు షాక్‌.. రాజీనామా చేసిన గంటల్లోనే బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు!

02 Nov, 11:57

పులివెందుల పులి అన్నారు.. ఓటేయకుండా వెళ్లారు: జగన్‌పై అచ్చెన్న విమర్శలు

02 Nov, 11:48

పోలీసు శాఖకు వన్నె తెచ్చిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం.. సమర్థుడైన అధికారి: సీఎం చంద్రబాబు నివాళి

02 Nov, 11:44

రైలు బోగీల రంగులు వేర్వేరుగా ఎందుకుంటాయో తెలుసా? నీలం, ఎరుపు, తెలుపు వెనుక అసలు కథ ఇదే!

02 Nov, 11:41

మురసు తుపానుపై పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

02 Nov, 11:35

ప్రేమలో దారుణంగా మోసపోయా: రెజీనా కసాండ్రా

02 Nov, 11:33

ఓట్‌ చోరీ జరిగితే రాహుల్‌, రేవంత్‌ ఎలా గెలిచారు?: రాంచందర్‌ రావు

02 Nov, 11:30

కుటుంబ కలహాలతో విషాదం.. అత్త, కొడుకు, కోడలు ఆత్మహత్యాయత్నం

02 Nov, 11:22

ఎర్రన్నాయుడు వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్

02 Nov, 11:19

తొలి వారాంతంలోనే సత్తా చాటిన 'ఆదర్శ కుటుంబం'.. కలెక్షన్లు ఎంతంటే?

02 Nov, 11:18

హెచ్‌-1బీ వీసా పొడిగింపు ఇకపై సులువు కాదు.. భారతీయ నిపుణులకు ఇబ్బందులు?

02 Nov, 11:16

టీమిండియా కోచ్‌గా మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నా.. గంభీర్‌ కీలక వ్యాఖ్యలు

02 Nov, 11:16

కర్ణాటకలో పెరగనున్న ఆర్టీసీ బస్సు ఛార్జీలు

02 Nov, 11:04

రాప్తాడు ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది.. మంచు మనోజ్‌ భావోద్వేగ పోస్ట్‌

02 Nov, 10:56
..More Telugu News