పవన్ మాటలు అర్థం లేనివి.. తెలివి తక్కువగా మాట్లాడటం మంచిది కాదు: బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి
- పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి
- తెలంగాణలో కాంగ్రెస్, జనసేన మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఆరోపణ
- ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే ఈ డ్రామా అని వ్యాఖ్య
తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం వెనుక పెద్ద కుట్ర ఉందని జగదీశ్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, జనసేన మధ్య ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ ఈ ఘటనతో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో నెలకొన్న ప్రజా సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ హైడ్రామా నడుపుతున్నారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. పవన్ కల్యాణ్, కాంగ్రెస్ పార్టీలు కావాలనే ఈ నాటకాన్ని సృష్టించాయని ఆయన విమర్శించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.