ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్

Indigo Flight Emergency Landing at Shamshabad Airport
  • బెంగళూరు నుంచి నాగపూర్ వెళుతున్న ఇండిగో విమానం
  • విమానంలో సమస్యను గుర్తించి అధికారులకు సమాచారమిచ్చిన పైలట్
  • విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఊపిరిపీల్చుకున్న ప్రయాణికులు
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. బెంగళూరు నుంచి నాగపూర్ వెళుతున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో శంషాబాద్‌లో దిగింది. విమానంలో సమస్యను గుర్తించిన పైలట్ విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు విమానం అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.

ఈ విమానంలో 126 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. నిన్న కూడా రెండు విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో రన్‌వేపై దించారు. నిన్న ఉదయం శంషాబాద్ నుంచి జగ్‌దల్‌పూర్ బయలుదేరిన ఓ విమానంలో, ఆ తర్వాత మధ్యాహ్నం రాజమండ్రికి బయలుదేరిన మరో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తాయి.
Advertisement
Indigo Airlines
Shamshabad Airport
Emergency Landing
Technical Problem
Rajiv Gandhi International Airport

More Telugu News