నాగచైతన్య అనుమతి లేకుండా ఆయన ఫొటోలు, వీడియోలు వాడొద్దు: ఢిల్లీ హైకోర్టు

Delhi High Court protects Naga Chaitanya privacy rights
  • తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు వాడుకుంటున్నారంటూ నాగచైతన్య పిటిషన్
  • తన హక్కులను కాపాడాలని కోరిన చైతూ
  • చైతూ విన్నపంపై సానుకూలంగా స్పందించిన కోర్టు
తన వ్యక్తిగత గోప్యతను, హక్కులను కాపాడాలని కోరుతూ టాలీవుడ్ హీరో నాగచైతన్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన అనుమతి లేకుండానే తన పేరును, ఫొటోలను దుర్వినియోగం చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. 

నాగచైతన్య అభ్యర్థనపై ఢిల్లీ హైకోర్టు సానుకూలంగా స్పందించింది. నాగచైతన్య అనుమతి లేకుండా ఆయన పేరు, ముఖ రూపం, స్వరాన్ని వాణిజ్యపరంగా వాడకూడదని తీర్పును వెలువరించింది. నాగచైతన్య వ్యక్తిగత హక్కులను పరిరక్షిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పలువురు సినీ స్టార్లు ఢిల్లీ హైకోర్టు నుంచి ఇదే రకమైన రక్షణ పొందిన సంగతి తెలిసిందే.   
Go Back to Shorts
Naga Chaitanya
Naga Chaitanya photos
Naga Chaitanya videos
Delhi High Court
Privacy rights
Personal rights
Tollywood
Image misuse

More Telugu News