నేరస్తుడ్నని తెలిసి తన ప్రేమని తిరస్కరించిందని.. యువతి ఇంటిపై పెట్రోల్ బాంబ్స్

Love rejection leads to petrol bomb attack in Coimbatore Karthi arrested
  • ప్రేమను నిరాకరించడంతో యువతి ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి
  • తమిళనాడులోని కోయంబత్తూరు తొండముత్తూరులో ఘటన
  • దాడి దృశ్యాలు సీసీటీవీలో రికార్డు
  • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడి
తమిళనాడులోని కోయంబత్తూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాను నేరస్తుడ్ని అని తెలిసి ఓ యువతి తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో, ఓ యువకుడు ఆమె ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కోయంబత్తూరు సమీపంలోని తొండముత్తూరు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వచ్చి, యువతి ఇంటిపై రెండు పెట్రోల్ బాంబులు విసిరాడు.

ఈ దాడితో ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి నీళ్లు చల్లి మంటలను ఆర్పివేశారు. అక్కడున్న ద్విచక్రవాహనాన్ని, సైకిల్ ను పక్కకు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, పెద్ద నష్టం కూడా జరగలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఫుటేజీ సహాయంతో నిందితులను గుర్తించి, ఈ ఘటనకు సంబంధించి కార్తీ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.
Go Back to Shorts
Karthi
Coimbatore
Petrol bomb attack
Tamil Nadu crime
Love rejection crime
Thondamuthur
Crime news
Youth arrested
CCTV footage
Police investigation

More Telugu News