గిల్ బుగ్గ గిల్లిన కోహ్లీ.. క్వాలిఫయర్ పోరుకు ముందు ఆసక్తికర దృశ్యం.. ఇదిగో వీడియో!

  • క్వాలిఫయర్-1 మ్యాచ్‌కు ముందు కోహ్లీ, గిల్ ల ఆత్మీయ ప‌ల‌క‌రింపు  
  • శుభ్‌మన్ గిల్ బుగ్గ గిల్లుతూ సరదాగా ఆటపట్టించిన‌ కోహ్లీ 
  • ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌
  • రేపు ఆర్సీబీ, గుజరాత్ మధ్య తొలి క్వాలిఫయర్ మ్యాచ్
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ఫైనల్ బెర్త్ కోసం కీలక పోరుకు ముందు ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా గిల్ గ‌డ్డాన్ని లాగి, బుగ్గ గిల్లుతూ కోహ్లీ సరదాగా ఆటపట్టించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రేపు ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో ఆర్సీబీ, గుజరాత్ జట్ల మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. దీనికి ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో ఆర్సీబీ వైస్ కెప్టెన్ జితేష్ శర్మతో గిల్ మాట్లాడుతుండగా కోహ్లీ అక్కడికి వచ్చాడు. తన అభిమాన ఆటగాడిని చూడగానే గిల్ అత‌ని వద్దకు వెళ్లి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. అనంతరం కోహ్లీ, గిల్ గడ్డాన్ని సరదాగా లాగి, బుగ్గ గిల్లారు. ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కడంతో అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

ఈ సీజన్‌లో కోహ్లీ, గిల్ ఇద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఆర్సీబీ తరఫున కోహ్లీ 14 మ్యాచ్‌లలో ఒక సెంచరీ, నాలుగు అర్ధసెంచరీలతో 557 పరుగులు చేశాడు. మరోవైపు గుజరాత్ కెప్టెన్ గిల్ 616 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అతని సహచర ఆటగాడు సాయి సుదర్శన్ (638) అగ్రస్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ, గుజరాత్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ అర్హత సాధించాయి. రేపు జరిగే క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టు నేరుగా మే 31న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌కు చేరుకుంటుంది. ఎల్లుండి సన్‌రైజర్స్, రాజస్థాన్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఎలిమినేటర్ లో గెలిచిన జట్టు... క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుతో ఈ నెల 29న క్వాలిఫయర్-2లో ఆడనుంది. 

Virat Kohli
Shubman Gill
RCB
Royal Challengers Bangalore
Gujarat Titans
IPL 2026
IPL Playoffs
Orange Cap
Cricket
HPCA Stadium Dharamshala

More Telugu News