జోష్ ఇంగ్లిస్ సూపర్ ఫిఫ్టీ... లక్నో భారీ స్కోరు
- పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసిన లక్నో
- రాణించిన జాష్ ఇంగ్లిస్ (72), ఆయుష్ బదోని (43)
- చివర్లో మెరుపులు మెరిపించిన అబ్దుల్ సమద్ (37 నాటౌట్)
- పంజాబ్ బౌలర్లలో చాహల్, మార్కో యాన్సెన్‌కు రెండేసి వికెట్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ (72) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా, ఆయుష్ బదోని (43), అబ్దుల్ సమద్ (37 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. దీంతో పంజాబ్ ముందు 197 పరుగుల లక్ష్యాన్ని లక్నో నిర్దేశించింది.
లక్నోలోని ఏకానా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (0), నికోలస్ పూరన్ (2) స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో 20 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఆయుష్ బదోని, ఓపెనర్ జోష్ ఇంగ్లిస్‌తో కలిసి ఎదురుదాడికి దిగాడు. కేవలం 18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులు చేసి స్కోరు బోర్డుకు ఊపు తెచ్చాడు.
బదోని ఔటైన తర్వాత కెప్టెన్ రిషభ్ పంత్ (26) కాసేపు నిలబడ్డా, ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. మరోవైపు, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇంగ్లిస్ కూడా 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. చివర్లో అబ్దుల్ సమద్ కేవలం 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో లక్నో భారీ స్కోరు చేయగలిగింది.
పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 4 ఓవర్లలో కేవలం 25 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. మార్కో యాన్సెన్ కూడా 2 వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్ 3 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి తీవ్రంగా నిరాశపరిచాడు.