టీ20 తరహా క్రికెట్... తెలంగాణలో టీజీ20 లీగ్

HCA TG Cricket League T20 Style Tournament Announced
  • ఎనిమిది జట్లను ఏర్పాటు చేసిన హెచ్‌సీఏ
  • జూన్ 20న తొలి మ్యచ్, జూలై 11న ఫైనల్ మ్యాచ్
  • హైదరాబాద్ జట్టును రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసిన ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్
  • జూన్ 7న ఆటగాళ్ల వేలం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) టీజీ20 క్రికెట్ లీగ్‌కు శ్రీకారం చుట్టింది. టీ20 తరహాలో క్రికెట్ లీగ్‌కు హెచ్‌సీఏ సిద్ధమైంది. టీజీ20 క్రికెట్ లీగ్ కోసం ఎనిమిది జట్లను ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్‌ల కోసం షెడ్యూల్ కూడా విడుదలైంది. జూన్ 20వ తేదీన తొలి మ్యాచ్, జూలై 11న ఫైనల్ మ్యాచ్ ఉంటాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం జట్లు ఉన్నాయి.

ఆయా జట్లను వివిధ సంస్థలు సొంతం చేసుకున్నాయి. హైదరాబాద్ జట్టును రూ.7.5 కోట్లకు ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, రంగారెడ్డిని రూ.7.2 కోట్లకు బూరుగు ఇన్ఫ్రా ప్రణవ, వరంగల్‌ను రూ.6.55 కోట్లకు బైన్ గ్లోబల్ రిసోర్సెస్, మెదక్‌ను రూ.6.33 కోట్లకు బృందా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, నల్గొండను రూ.5.06 కోట్లకు కిశోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, కరీంనగర్‌ను రూ.4.57 కోట్లకు ఈఐపీఎల్ గ్రూప్ (తిబరుమల్), మహబూబ్ నగర్‌ను రూ.4.5 కోట్లకు వీరభద్ర స్టీల్స్, ఖమ్మం జట్టును రూ.4.44 కోట్లకు అన్విత గ్రూప్ సొంతం చేసుకున్నాయి.

కాగా, ఈ ఫ్రాంచైజీల కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియను జూన్ 7న నిర్వహించనున్నారు. 
Go Back to Shorts
HCA
Hyderabad Cricket Association
TG Cricket League
T20 League
Hyderabad
Rangareddy
Warangal

More Telugu News