పాస్టర్ అభినయ్ దర్శన్‌పై దాడి కేసు.. వివరాలు వెల్లడించిన ఎస్పీ

  • 8 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడి
  • ఏ1గా పాస్టర్ అభినయ్ దర్శన్ పేరు
  • దాడికి సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేశామన్న ఎస్పీ
  • పాస్టర్ అభినయ్ దర్శన్‌పై గతంలోనూ వరకట్నం కేసులు ఉన్నాయన్న ఎస్పీ
పాస్టర్ అభినయ్ దర్శన్‌పై హత్యాయత్నం అవాస్తవమని, దీనికి సంబంధించి 8 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల చింతపల్లి పరిసర ప్రాంతాల్లో తన కారుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారని, తృటిలో తాను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని అభినయ్ దర్శన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా నాటకమని పోలీసులు విచారణలో గుర్తించారు.

ఈ కేసు వివరాలను అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ మీడియాకు వివరించారు. కల్పిత దాడి ఘటనలో 8 మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఇందులో ఏ1గా పాస్టర్ అభినయ్ దర్శన్ ఉన్నట్లు వెల్లడించారు. ఏ2గా బిల్లా కిరణ్, ఏ3గా కె. బెన్హర్, ఏ4గా భానుప్రసాద్ పేర్కొన్నారు.

దాడికి సహకరించిన వసంత్ కుమార్, ప్రేమ్ కుమార్, సత్యరాజు, ఇంద్రకుమార్‌లపై కూడా కేసులు నమోదు చేశామని అన్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారనే అభియోగంపై కూడా కేసులు పెట్టామని అన్నారు. అభినయ్ దర్శన్‌పై గతంలోనూ కేసులు ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు. వరకట్నం, యువతిని వేధించిన కేసులు ఉన్నట్లు చెప్పారు.

Abhinay Darshan
Pastor Abhinay Darshan
Chintapalli
Alluri Sitarama Raju district
Amit Bardar

More Telugu News