పవన్ కల్యాణ్ పై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు

  • పిఠాపురం ప్రజలను సొంత కుటుంబంలా చూసుకుంటారన్న నిహారిక
  • ఎలక్ట్రిషియన్ విద్యుదాఘాతంతో చనిపోతే స్పందించారని వెల్లడి
  • 325 మందికి సేఫ్టీ కిట్ అందజేసినట్లు వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మెగా డాటర్ కొణిదెల నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. పిఠాపురం నియోజకవర్గం ప్రజలను ఆయన తన సొంత కుటుంబంలా చూసుకుంటున్నారని అన్నారు. పిఠాపురం వెళితే తనకు తన సొంతూరుకు వెళ్ళినట్లుగా అనిపిస్తుందని అన్నారు.

తన నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు ఒక ఎలక్ట్రిషియన్ విద్యుదాఘాతంతో చనిపోతే నియోజకవర్గంలోని ఎలక్ట్రిషియన్లందరికీ పవన్ కల్యాణ్ సేఫ్టీ కిట్లు అందజేశారని తెలిపారు. మొత్తం 325 మందికి భద్రతా కిట్లను అందజేసినట్లు వెల్లడించారు. ప్రజా సమస్యల పట్ల సకాలంలో స్పందించడంలో ఆయనకు ఎవరూ సాటిరారని అన్నారు.

Pawan Kalyan
Niharika Konidela
Pithapuram
Janasena
Andhra Pradesh Deputy CM
Nagababu

More Telugu News