మోదీ తీరుపై నార్వే జర్నలిస్టు అసంతృప్తి... ఘాటుగా సమాధానం ఇచ్చిన విదేశాంగ శాఖ అధికారి
- ప్రధాని మోదీ నార్వే పర్యటనలో చెలరేగిన వివాదం
- ప్రశ్నలు పట్టించుకోకుండా వెళ్లారంటూ మోదీపై జర్నలిస్ట్ విమర్శ
- విదేశాంగ శాఖ బ్రీఫింగ్లో భారత ప్రజాస్వామ్యంపై జర్నలిస్ట్ ప్రశ్నలు
- 'కోర్టుకు వెళ్లండి' అంటూ ఘాటుగా బదులిచ్చిన భారత అధికారి
- సోషల్ మీడియాలో వైరల్ అయిన దౌత్యాధికారి సమాధానం
ప్రధాని నరేంద్ర మోదీ నార్వే పర్యటనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛపై ప్రశ్నలు లేవనెత్తిన ఓ నార్వేజియన్ జర్నలిస్టుకు, భారత విదేశాంగ శాఖ అధికారి ఘాటుగా సమాధానమిచ్చారు. 'ఏమైనా సమస్యలుంటే కోర్టుకు వెళ్లండి' అంటూ ఆయన ఇచ్చిన జవాబు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐరోపా పర్యటనలో భాగంగా ఓస్లోలో ప్రధాని మోదీ, నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నార్వే ప్రధాని ప్రశ్నలకు సమాధానమిచ్చినా, మోదీ మాత్రం ప్రశ్నలను పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీనిపై నార్వేజియన్ జర్నలిస్ట్ హెల్లె లింగ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తన ప్రశ్నను స్వీకరించలేదని ఆమె ఆరోపించారరు.
అనంతరం భారత విదేశాంగ శాఖ నిర్వహించిన మీడియా సమావేశంలో అదే జర్నలిస్ట్ పాల్గొన్నారు. భారత ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛ వంటి అంశాలపై ఆమె ప్రశ్నలు సంధించారు. దీంతో ఆమెకు, విదేశాంగ శాఖ కార్యదర్శి (వెస్ట్) సిబి జార్జ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
సిబి జార్జ్ తన సమాధానంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థను బలంగా సమర్థించారు. భారత రాజ్యాంగం పౌరులకు ప్రాథమిక హక్కులు కల్పించిందని, న్యాయం కోసం ఆర్టికల్ 32, 226 కింద కోర్టులకు వెళ్లే స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. కొంతమంది విదేశీ విమర్శకులు "అజ్ఞాన ఎన్జీవోలు" ఇచ్చే నివేదికలపై ఆధారపడి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏవైనా సమస్యలుంటే కోర్టును ఆశ్రయించాలని ఆమెకు సూచించారు.
జర్నలిస్ట్ పదేపదే అడ్డుతగలడంతో సిబి జార్జ్ కాస్త అసహనానికి గురయ్యారు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, భారత దౌత్యాధికారి ఇచ్చిన బలమైన సమాధానంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.